NGK Movie Review : సూర్య NGK మూవీ రివ్యూ..

తమిళ స్టార్ హీరో సూర్య, సెల్వరాఘవన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘NGK’. భారీ అంచనాలతో పొలిటికల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఈ రోజే ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో దర్శకుడు సెల్వ రాఘవన్.. సూర్యకు మంచి సక్సెస్ అందించాడా లేదా మన రివ్యూలో చూద్దాం...

news18-telugu
Updated: May 31, 2019, 3:10 PM IST
NGK Movie Review : సూర్య NGK మూవీ రివ్యూ..
సూర్య ngk కటౌట్
  • Share this:
నటీనటులు:సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు

దర్శకుడు: సెల్వ రాఘవన్

నిర్మాతలు : ఎస్.ఆర్.ప్రభు, ప్రకాష్ బాబు

సినిమాటోగ్రఫీ : శివకుమార్ విజయన్మ్యూజిక్ : యువన్ శంకర్ రాజా

రేటింగ్ : 2.25/5

తమిళ స్టార్ హీరో సూర్య, సెల్వరాఘవన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘NGK’. భారీ అంచనాలతో పొలిటికల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఈ రోజే ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో దర్శకుడు సెల్వ రాఘవన్.. సూర్యకు మంచి సక్సెస్ అందించాడా లేదా మన రివ్యూలో చూద్దాం...కథ విషయానకొస్తే..

ఎం.టెక్ వంటి ఉన్నత చదవులు నంద గోపాలకృష్ణ (సూర్య) తన సొంత ఊరిలో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తుంటాడు. అలా ఉంటూనే ఊర్లో వాళ్లకు తలలో నాలుక అవుతాడు. అలాంటి ఉంటూనే ఆ ఊరి ఎమ్మెల్యేకు దగ్గరవుతాడు అతని అండగా నిలబడతాడు. ఐతే కలిసి పనిచేస్తోన్న సమయంలో కొన్ని అవమానాలు ఎదుర్కొన్న నందగోపాల కృష్ణ రాజకీయాలను ప్రక్షాళన చేయాలనుకుంటాడు. అందుకే ప్రజా పాలన పార్టీని నెలకొల్పుతాడు. ఇంతకీ పార్టీ పెట్టిన హీరో ఎన్నికల్లో గెలిచి తాను అనుకున్నది సాధించాడా లేదా అనేదే ‘ఎన్జీకే’ సినిమా స్టోరీ.

నటీనటుల విషయానికొస్తే..

ఇప్పటి వరకు గజినీ, సింగం వంటి క్యారెక్టర్స్‌తో ఎలా మెప్పించాడో .. ఒక ఫక్తు పొలిటికల్ లీడర్ పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా మొత్తం అతని పాత్ర చుట్టే తిరగడంతో.. హీరోయిన్స్‌గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి పాత్రలు తేలిపోయాయి. నందగోపాల్ ను అనుక్షణం అనుమానించే  భార్య  పాత్రలో సాయి పల్లవి నటించింది.  అతని రాజకీయాల్లో తోడ్పాటు అందించే పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ చేసింది. మరోవైపు సాయి పల్లవి పాత్ర లేకపోయిన ఈసినిమాకు పెద్దగా ఒదిగేది లేదు. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ:

7/G బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే  వంటి డిఫరెంట్ లవ్ స్టోరీస్‌తో మెప్పించిన సెల్వ రాఘవన్..ఈ సారి సూర్యతో పూర్తిస్థాయి పొలిటికల్ థ్రిల్లర్‌ను తెరకెక్కించాడు. సాధారణ కార్యకర్త సీఎం స్థాయి ఎదగాడనే కాన్సెప్ట్‌కు తగ్గట్టు సీన్స్ అల్లుకోవడంలో సెల్వరాఘవన్ విఫలమయ్యాడు. హీరోయిన్ సాయి పల్లవితో సూర్య సన్నివేశాలు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన కొన్ని సినిమాలు గుర్తుకు రాకమానవు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫోటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్

  • సూర్య నటన

  • ఫోటోగ్రఫీ, నిర్మాణ విలువలు

  • మ్యూజిక్,


మైనస్

  • కథ

  • సరైన కథనం లేకపోవడం

  • దర్శకత్వం


చివరి మాట: రొటీన్ పొటికల్ డ్రామా..
First published: May 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>