హోమ్ /వార్తలు /సినిమా /

Aakasam Nee Haddura Review: ఆకాశం నీ హద్దురా ఎలా ఉంది? ట్విటర్ రివ్యూ

Aakasam Nee Haddura Review: ఆకాశం నీ హద్దురా ఎలా ఉంది? ట్విటర్ రివ్యూ

ఆకాశం నీ హద్దురా: సూర్య హీరోగా సుధ కొంగర తెరకెక్కించిన సినిమా ఆకాశం నీ హద్దురా. ఈ మధ్య కాలంలో ఓటిటిలో బిగ్గెస్ట్ హిట్ ఇదే. సూర్యకు చాలా రోజుల తర్వాత వచ్చిన అద్భుతమైన విజయం ఇది.

ఆకాశం నీ హద్దురా: సూర్య హీరోగా సుధ కొంగర తెరకెక్కించిన సినిమా ఆకాశం నీ హద్దురా. ఈ మధ్య కాలంలో ఓటిటిలో బిగ్గెస్ట్ హిట్ ఇదే. సూర్యకు చాలా రోజుల తర్వాత వచ్చిన అద్భుతమైన విజయం ఇది.

Aakasam Nee Haddura: ఆకాశం నీ హద్దు సినిమా చాలా ఎమోషనల్‌గా ఉందని.. సూర్య నటన అద్భుతమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఎప్పటిలానే తన పాత్రలో జీవించేశాడని కొనియాడుతున్నారు.

సూర్య సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా అతడి సినిమాల ఉంటాయి. వెరైటీ సబ్జెక్ట్‌తో నేచురల్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాడు. ఇక ఇవాళ విడుదలైన ఆకాశం నీ హద్దు సినిమాపైనా అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీలో సూర్యతో పాటు అపర్ణా బాలమురళి, మోహన్ బాబు, పరేష్ రావల్, జాకీ ష్రాఫ్ ప్రాధాన పాత్రల్లో నటించారు. సుధా కే ప్రసాద్ దర్శకత్వం వహించిన ఆకాశం హద్దు రా మూవీని.. 2డీ ఎంటర్‌టైన్మెంట్స్, శిఖ్యా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్య నిర్మించారు. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందించారు.

ఆకాశ నీ హద్దురా.. సినిమా ఇవాళ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలయింది. సాధారణ స్కూల్‌ టీచర్‌ కొడుకు రాత్రింబవళ్లు కష్టపడి ఓ ఎయిర్‌ లైన్స్‌ సంస్థను ఎలా స్థాపించాడన్నదే ఈ సినిమా కథ. మరి భారీ తారగణంతో.. అద్భుతమైన కథాంశంతో.. వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? అభిమానులను అంచనాలను అందుకుందా? విమర్శలకులను మెుప్పించిందా? ఇప్పటికే సినిమాను చూసిన కొందరు ప్రేక్షకులు, సినీ స్టార్లు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూడండి.
ఆకాశం నీ హద్దు సినిమా చాలా ఎమోషనల్‌గా ఉందని.. సూర్య నటన అద్భుతమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఎప్పటిలానే తన పాత్రలో జీవించేశాడని కొనియాడుతున్నారు. ఇది మంచి సందేశాత్మక చిత్రమని.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు.

First published:

Tags: Suriya, Tollywood

ఉత్తమ కథలు