SURIYAS AAKASAM NEE HADDURA DIRECTOR SUDHA KONGARA TO MAKE BIOPIC ON BUSINESSMAN RATAN TATA BA
‘ఆకాశమే నీ హద్దురా’ డైరెక్టర్ సుధ కొంగర మరో క్రేజీ ప్రాజెక్టు.. సూపర్ బయోపిక్
సుధా కొంగర (Sudha Kongara)
Sudha Kongara Movies: భారతదేశ వ్యాపార రంగంలో ప్రముఖమైన వ్యక్తి, బ్యాచ్‌లర్, ఏంజిల్ ఇన్వెస్టర్ అయిన రతన్ టాటా బయోపిక్‌ను తీసేందుకు సుధ కొంగ సిద్ధమైనట్టు తెలిసింది. ఆ ప్రాజెక్టు కోసం తెలుగులో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఆఫర్‌ను కూడా ఆమె తిరస్కరించినట్టు సమాచారం.
ఆకాశమే నీ హద్దురా సినిమాతో విమర్శకులతో పాటు సినీజనం ప్రశంసలు అందుకున్న లేడీ డైరెక్టర్ సుధ కొంగర మరో క్రేజీ ప్రాజెక్టును చేపట్టబోతున్నట్టు తెలిసింది. ఆకాశమే నీ హద్దురా అనే సినిమా ఎయిర్ డెక్కర్ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించారు. ఆ కథను స్ఫూర్తిగా తీసుకుని దానికి కొంచెం సినిమాటిక్ డ్రామా జోడించి సినిమాను రక్తి కట్టించారు. తమిళంలో సూరారై పోట్రుగా వచ్చిన ఈ సినిమాను స్వయంగా సూర్య నిర్మించాడు. సూర్య సొంత ప్రొడక్షన్ హౌస్ 2డీ ఎంటర్టైన్మెంట్తో పాటు గునీత్ మోంగా కూడా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఆమెకు తాజాగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ఆమెకు పిలిచి ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. తెలుగులో స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన ఆ సినీ నిర్మాణ సంస్థ నుంచి ఆఫర్ వచ్చినా కూడా ఆమె దాన్ని సున్నితంగా తిరస్కరించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం తన చేతిలో రెండేళ్లకు సరిపడా ప్రాజెక్టులు కమిట్ అయి ఉన్నానని, ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఆ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చి కొత్త సినిమా చేయడం సాధ్యం కాదని ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్టు తెలిసింది.
ఇంతకీ సుధ కొంగర తీసుకున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా. రతన్ టాటా బయోపిక్. భారతీయ వ్యాపార ప్రపంచంలో టాటాల ప్రస్తావన లేకుండా ఉండదు. అన్ని విభాగాల్లోనూ టాటా గ్రూప్ అడుగు పెట్టింది. అయితే, విమానయాన రంగంలో కూడా అడుగు పెట్టడానికి రతన్ టాటా చాలా ప్రయత్నాలు చేశారని, అయితే, ఆయన ప్రయత్నాలు సఫలం కాలేదనే అర్థం వచ్చేలా ఆకాశమే నీ హద్దురా సినిమాలో చూపించారు. ‘సాక్షాత్తూ రతన్ టాటానే 30 ఏళ్ల పాటు కాళ్లు అరిగేలా తిరిగి తిరిగి అలసిపోయాడు. నువ్వెంత.’ అని ఓ విమానయాన శాఖ అధికారి హీరో సూర్యతో అనే డైలాగ్ కూడా అందులో ఉంది.
భారతదేశ వ్యాపార రంగంలో ప్రముఖమైన వ్యక్తి, బ్యాచ్‌లర్, ఏంజిల్ ఇన్వెస్టర్ అయిన రతన్ టాటా బయోపిక్‌ను తీసేందుకు సుధ కొంగ సిద్ధమైనట్టు తెలిసింది. ఆ ప్రాజెక్టు కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ ఇచ్చిన ఆఫర్‌ను వద్దన్నారని సమాచారం.
2010లో డైరెక్టర్‌గా తన తొలి సినిమా తీసింది సుధ కొంగర. ద్రోహి అనే తమిళ సినిమాతో ఆమె మెగా ఫోన్ పట్టింది. ఆ తర్వాత తమిళంలో ఇరుదు సుత్రి (హిందీలో సాలా ఖద్దూస్, సినిమా తీసింది. అదే సినిమాను వెంకటేష్‌తో తెలుగులో తీశారు సుధ కొంగర. ఆ తర్వాత పుట్టం పూదు తాలై అనే సినిమా తీశారు. తాజాగా సూరారై పోట్రు సినిమా తీశారు. ప్రస్తుతం పావ కథైగల్ అనే వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.