మరోసారి ఆ పాత్రలో సూర్య.. ఈ సినిమా ఎలా ఉండనుందో..

తమిళ హీరో సూర్య ప్రస్తుతం సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వంలో ‘ఆకాశం నీ హద్దురా’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: March 24, 2020, 11:41 AM IST
మరోసారి ఆ పాత్రలో సూర్య.. ఈ సినిమా ఎలా ఉండనుందో..
సూర్య Photo : Twitter
  • Share this:
తమిళ హీరో సూర్య ప్రస్తుతం సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వంలో ‘ఆకాశం నీ హద్దురా’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. 'సూరారై పోట్రు' అనే పేరుతో తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితాధారంగా రూపొందుతోంది. ప్రముఖ నటుడు మోహన్‌ బాబు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో అలరించనున్నాడు. సుధా కొంగర గతంలో వెంకటేష్ ప్రధాన పాత్రలో 'గురు' సినిమాను దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ‘ఆకాశం నీ హద్దురా’ను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య స్వయంగా నిర్మిస్తున్నాడు. మలయాళీ నటి అపర్ణ బాలమురలి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇతర ముఖ్య పాత్రల్లో కాలీ వెంకట్, కారుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న నటిస్తున్నారు. ఆకాశం నీ హద్దురా’ వేసవి కానుకగా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

అది అలా ఉంటే.. ఆయన తన 39వ చిత్రాన్ని హరి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమా అనంతరం శివ దర్శకత్వంలో నటిస్తారు సూర్య. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత ఆయన మళ్లీ ఓ బయోపిక్‌లో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘కూటత్తిల్‌ ఒరుత్తన్‌’ ఫేమ్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. దీనికి సంబందించి ఇటీవలే సూర్య కూడా కథ విన్నారని టాక్. అంతేకాదు కథ నచ్చడంతో వెంటనే ఆయన అంగీకరించారని సమాచారం. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
Published by: Suresh Rachamalla
First published: March 24, 2020, 11:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading