హోమ్ /వార్తలు /సినిమా /

మరో సారి సింగం డైరెక్టర్‌తో సూర్య... హిట్ కొట్టేనా...

మరో సారి సింగం డైరెక్టర్‌తో సూర్య... హిట్ కొట్టేనా...

సూర్య Photo : Twitter

సూర్య Photo : Twitter

ప్రస్తుతం సూర్య.. సుధా కొంగర దర్శకత్వంలో ‘సూరరై పొట్రు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన తన తదుపరి సినిమాని సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ హరితో చేయనున్నాడు.

  Soorarai Pottru : తమిళ హీరో సూర్య ప్రస్తుతం సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వంలో ‘ఆకాశం నీ హద్దురా’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. 'సూరారై పోట్రు' అనే పేరుతో తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదల చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబందించి ఫస్ట్ లుక్ విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అంతేకాదు ఈ సినిమాలో 'పిల్ల పులి' అనే సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం ఈ పాట సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందుతోంది. జి వి ప్రకాష్ కుమార్ అందించిన ఆ పాటకు రామజోగయ్య రాసిన లిరిక్స్ తోడవ్వటంతో 'పిల్ల పులి' పాట యూట్యూబ్‌లో ఇరగదీస్తోంది. కాగా ఈ సినిమా సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితాధారంగా రూపొందుతోంది. ప్రముఖ నటుడు మోహన్‌ బాబు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో అలరించనున్నాడు. సుధా కొంగర గతంలో వెంకటేష్ ప్రధాన పాత్రలో 'గురు' సినిమాను దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

  ‘ఆకాశం నీ హద్దురా’ను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య స్వయంగా నిర్మిస్తున్నాడు. మలయాళీ నటి అపర్ణ బాలమురలి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇతర ముఖ్య పాత్రల్లో కాలీ వెంకట్, కారుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న నటిస్తున్నారు. ఆకాశం నీ హద్దురా’ వేసవి కానుకగా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అది అలా ఉంటే.. ఆయన తన 39వ చిత్రాన్ని హరి దర్శకత్వంలో చేయనున్నారు. సూర్య, హరి కాంబినేషన్‌లో ఇంతకుముందు సింగం సిరీస్‌లో అదిరిపోయే సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలతోనే వీరి కాంబినేషన్ పట్ల అభిమానుల్లో ప్రత్యేకత నెలకొంది. ఇప్పుడు సూర్య నెక్స్ట్ చిత్రాన్ని హరి డైరెక్ట్ చేయనున్నారని తెలియడంతో తమిళ ప్రేక్షకుల్లోనే కాదు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి మొదలైంది. ఈ సినిమా ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూట్ మొదలుకానుండగా దీపావళికి రిలీజ్ చేయనున్నారు. ‘అరువా’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు  ఇమ్మాన్ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ఇతర తారల, టెక్నికల్ క్రూ  వివరాలు తెలియాల్సి వుంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Suriya

  ఉత్తమ కథలు