Home /News /movies /

SURIYA SUPER HIT SINGHAM 2 ACTOR AND DANNY SUPPORTER CHEKUMAWE MALVIN ARRESTED IN DRUGS CASE PK

Singham actor arrested in Drugs case: డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన సూర్య ‘సింగం 2’ నటుడు..

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సింగం నటుడు (Singham actor)

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సింగం నటుడు (Singham actor)

Singham actor arrested in Drugs case: సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ ఏ స్థాయిలో ఉందో ఇప్పటికే ఒక క్లారిటీ అందరికీ వచ్చేసింది. తాజాగా మరో నటుడు కూడా డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. సూర్య హీరోగా వచ్చిన సింగం 2 సినిమాలో నటించిన నైజీరియన్ నటుడు చెకుమావే మాల్విన్‌ను (Singham actor arrested in Drugs case) అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇంకా చదవండి ...
సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ ఏ స్థాయిలో ఉందో ఇప్పటికే ఒక క్లారిటీ అందరికీ వచ్చేసింది. ఎందుకంటే ప్రతీ ఇండస్ట్రీలోనూ డ్రగ్స్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. మొన్నటి వరకు మన టాలీవుడ్ ప్రముఖులను కూడా 23 రోజులపాటు ఈడీ అధికారులు విచారణ జరిపారు. ఇందులో చాలా మందికి క్లీన్ చిట్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా మరో నటుడు కూడా డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. సూర్య హీరోగా వచ్చిన సింగం 2 సినిమాలో నటించిన నైజీరియన్ నటుడు చెకుమావే మాల్విన్ డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోయాడు. 2013లో హరి తెరకెక్కించిన సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్టైనర్ సింగం 2 సినిమాలో మెయిన్ విలన్ డాని పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు ఈయన. బెంగళూరు పోలీసులు మాల్విన్‌ను అరెస్ట్ చేశారు. బిజినెస్ మ్యాన్‌తో పాటు కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఈయన్ని పట్టుకున్నారు ఈస్ట్ బెంగళూరు పోలీసులు.

అతడి నుంచి 15 గ్రాముల MDMAతో పాటు 250 మిల్లీలీటర్ల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 15 లక్షల వరకు ఉంటుందని తెలిపారు పోలీసులు. ఇతడి నుంచి చాలా మంది మొబైల్ నెంబర్స్ కూడా తీసుకున్నారు పోలీసులు. అలాగే మాల్విన్ నుంచి పెద్ద మొత్తంలో మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి నుంచి కీలక సమాచారం రాబట్టనున్నారు ఈస్ట్ బెంగళూరు పోలీసులు. ఈ డ్రగ్స్ ఆపరేషన్ పక్కా ప్రణాళికతో పూర్తి చేసారు బెంగళూరు పోలీసులు. కేవలం సూర్య సింగం 2 సినిమా మాత్రమే కాదు కమల్ హాసన్ విశ్వరూపంతో పాటు మరికొన్ని సౌత్ సినిమాల్లో కూడా నటించాడు మాల్విన్. ఎక్కువగా నెగిటివ్ క్యారెక్టర్స్‌లోనే కనిపించాడు ఈయన. అలాగే సినిమాల్లో కూడా డ్రగ్స్ అమ్మే పాత్రలోనే ఈయన కనిపించాడు. సినిమాల్లో కాకుండా నిజజీవితంలో కూడా ఇదే కేసులో అరెస్టయ్యాడు ఈయన.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Drugs case, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు