Home /News /movies /

SURIYA STARRER JAI BHIM TO PREMIERE WORLDWIDE ON AMAZON PRIME VIDEO THIS DIWALI ON 2ND NOVEMBER SR

Suriya : అమెజాన్ ప్రైమ్‌లో సూర్య జై భీమ్.. నవంబర్ 2 నుంచి స్ట్రీమింగ్..

Jai Bhim in Prime Video Photo : Twitter

Jai Bhim in Prime Video Photo : Twitter

Suriya : తమిళ నటుడు సూర్య గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ఆయన ఇటీవల ఆకాశం నీ హద్దురా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కాగా ఆయన నటిస్తున్న మరో సినిమా జై భీమ్.. కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా దీపావళీ సందర్భంగా నవంబరు 2 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది.

ఇంకా చదవండి ...
    తమిళ నటుడు సూర్య గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు.. తన సినిమా గజనితో తెలుగు వారి హ‌ృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు గజని రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. ఇటీవల సూర్య నటించిన మరో బ్లాక్ బస్టర్ (Soorarai Pottru) 'సూరారై పొట్రు'. ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా... పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే ఓ మైలు రాయిగా నిలిచింది. కరోనా కారణంగా ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.

    అంతేకాదు 'ఆస్కార్' రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంటోంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. గత సంవత్సరం నవంబ‌ర్ 12న ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుద‌లైన ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అంతేకాదు కొన్నేళ్లుగా ఫ్లాప్‌ల‌తో డీలా ప‌డ్డ సూర్య‌కు ఈ చిత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

    Chiranjeevi : చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ సమయం రానే వచ్చింది...

    క‌థ మొద‌లు ప్ర‌ధాన పాత్రాధారుల న‌ట‌న‌, స్క్రీన్ ప్లే, సుధా కొంక‌ర ద‌ర్శ‌క‌త్వం, జీవీ ప్ర‌కాష్ సంగీతం, నిర్మాణ విలువ‌లు అన్నీ ఈ సినిమాకు ప్ల‌స్‌గా మారాయి. అంతర్జాతీయ సినిమా రివ్యూ సంస్థ 'ఐఎండీబీ'లో అత్యధిక రేటింగ్ వచ్చిన మూడో సినిమాగా రికార్డ్‌ నెలకొల్పింది. 'ఆకాశం నీ హ‌ద్దురా'లో సూర్య‌కు జంటగా అప‌ర్ణ బాల‌ముర‌ళి న‌టించ‌గా ఇతర ముఖ్య పాత్రల్లో మోహ‌న్‌బాబు, ప‌రేష్ రావ‌ల్‌, ఊర్వ‌శి నటించారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంట‌ర్‌టైన్మెంట్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మించారు.




    ఇక అది అలా ఉంటే సూర్య నటిస్తున్న మరో సినిమా జై భీమ్ (Jai Bhim). జై భీమ్.. ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో సూర్య లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు. అణగారిన, పేదల కోసం పాటుపడే లాయర్ పాత్రలో సూర్య ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా సూర్య గత చిత్రం ఆకాశం నీ హద్దురా మాదిరిగానే డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలకానుంది.

    Love Story : లవ్ స్టోరి ఏడు రోజుల కలెక్షన్స్.. ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందంటే..

    దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా గురించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా దీపావళీ సందర్భంగా నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి ప్రైమ్ వీడియో తాజాగా ఓ ప్రకటన చేసింది.

    జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక దంపతులు నిర్మాణం వహిస్తున్నారు. ‘జై భీమ్’ సినిమా అడివి బిడ్డలకు, కార్పోరేట్ శక్తులకు మధ్య జరిగే పోరాట నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో సూర్య అడవి బిడ్దల తరుపున న్యాయ పోరాటం చేసే వకీల్ సాబ్ పాత్రలో కనిపించనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Suriya, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు