హోమ్ /వార్తలు /సినిమా /

Suriya Soorarai Pottru: సూర్య ఆకాశం నీ హద్దురా సినిమాకు మరో అరుదైన గౌరవం...

Suriya Soorarai Pottru: సూర్య ఆకాశం నీ హద్దురా సినిమాకు మరో అరుదైన గౌరవం...

Suriya Soorarai Pottru Photo : Twitter

Suriya Soorarai Pottru Photo : Twitter

Suriya Soorarai Pottru: ఆకాశం నీ హద్దురా.. త‌మిళంలో 'సూరారై పొట్రు'గా తెరకెక్కింది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య ప్రధాన పాత్ర పోషించారు.

ఆకాశం నీ హద్దురా.. త‌మిళంలో 'సూరారై పొట్రు'గా తెరకెక్కింది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య ప్రధాన పాత్ర పోషించారు. గ‌తేడాది కరోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఓటీటీలో విడుద‌లై పెద్ద విజ‌యం సాధించింది. నవంబ‌ర్ 12న ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుద‌లైన ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అంతేకాదు కొన్నేళ్లుగా ఫ్లాప్‌ల‌తో డీలా ప‌డ్డ సూర్య‌కు ఈ చిత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. క‌థ మొద‌లు ప్ర‌ధాన పాత్రాధారుల న‌ట‌న‌, స్క్రీన్ ప్లే, సుధా కొంక‌ర ద‌ర్శ‌క‌త్వం, జీవీ ప్ర‌కాష్ సంగీతం, నిర్మాణ విలువ‌లు అన్నీ ఈ సినిమాకు ప్ల‌స్‌గా మారాయి. ఇక స‌ర్వత్రా ప్ర‌శంస‌ల‌ను సంపాదించుకున్న ఈ మూవీ ఆ మ‌ధ్య‌న ప్ర‌తిష్టాత్మక ఆస్కార్ అవార్డు బ‌రిలోకి వెళ్లిన విష‌యం తెలిసిందే. జ‌న‌ర‌ల్ కేట‌గిరీలో బెస్ట్ యాక్ట‌ర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్ట‌ర్, బెస్ట్ ఒరిజ‌న‌ల్ స్కోర్‌తో పాటు ప‌లు కేట‌గిరిల్లో ఈ చిత్రం పోటీకి సిద్ధ‌మైంది. కాని నామినేషన్‌లో చోటు దక్కించుకోలేకపోయింది.

అది అలా ఉంటే ఈ చిత్రానికి మరో గౌరవం దక్కింది. ఈ సినిమాను షాంఘై ఫిలిమ్ ఫెస్టివల్‌లో పానరోమా విభాగంలో ప్రదర్శించనున్నారు. మరోవైపు అంతర్జాతీయ సినిమా రివ్యూ సంస్థ 'ఐఎండీబీ'లో అత్యధిక రేటింగ్ వచ్చిన మూడో సినిమాగా రికార్డ్‌ నెలకొల్పింది. దీంతో సూర్య అభిమానులు ఖుషీ ఖషీగా ఉన్నారు. సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ఆకాశం నీ హ‌ద్దురా'లో సూర్య‌కు జంటగా అప‌ర్ణ బాల‌ముర‌ళి న‌టించ‌గా ఇతర ముఖ్య పాత్రల్లో మోహ‌న్‌బాబు, ప‌రేష్ రావ‌ల్‌, ఊర్వ‌శి నటించారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంట‌ర్‌టైన్మెంట్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మించారు.

ఇక ఈ చిత్రంతో పాటు మలయాళ చిత్రం 'ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌' కూడా షాంఘై ఫిల్మ్ ఫెస్టివల్‌ ప్రదర్శనకు ఎంపికైంది. ఈ మలయాళీ చిత్రాన్ని జో బేబీ దర్శకత్వం వహించారు. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఓ మహిళ ఎలా వంటిట్లో వండూతూ అక్కడే ఇరుక్కుపోయింది. సంప్రదాయం పేరుతో ఉద్యోగం చేయకూడదంటూ ఎలా పెద్దలు కండీషన్స్ పెడుతుంటారు వంటీ అంశాలను ఈ సినిమా చర్చించింది. ఈ చిత్రం తెలుగు-తమిళ భాషల్లో కన్నన్‌ దర్శకత్వంలో రీమేక్‌ అవుతోంది. రాహుల్‌ రవీంద్రన్‌, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు.

First published:

Tags: Suriya, Tollywood news

ఉత్తమ కథలు