Home /News /movies /

SURIYA SOORARAI POTTRU TO BE SCREENED AT GOLDEN GLOBE AWARDS 2021 SR

Suriya : ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికైన సూర్య సూరారై పొట్రు..

సూర్య Photo : Twitter

సూర్య Photo : Twitter

Suriya :సూర్య ప్రధాన పాత్రలో సుధా కొంగర దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆకాశం నీ హద్దురా..

    సూర్య ప్రధాన పాత్రలో సుధా కొంగర దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆకాశం నీ హద్దురా.. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమాను డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్’లో విడుదల చేసింది చిత్రృందం. బందోబస్త్ తర్వాత సూర్య నటించిన ఈ ఆకాశం నీ హద్దురా..  మంచి అంచనాలతో విడుదలైంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్. గోపినాధ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం త‌మిళంలో 'సూరారై పొట్రు'గా తెరకెక్కింది. తెలుగులో ఆకాశం నీ హద్దురా గా డబ్ అయ్యింది. సూర్యతో పాటు మోహన్ బాబు కూడా కీలకపాత్రలో కనిపించాడు. సూర్య నిర్మిస్తూ నటించిన ఈ సినిమాలో మలయాళీ భామ అపర్ణ బాలమురళి హీరోయిన్ గా చేసింది. గతంలో వెంకటేష్ తో గురు చిత్రాన్ని తెరకెక్కించిన తెలుగు మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ మూవీని డైరెక్ట్ చేసింది. హిందీలో ఈ మూవీని షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. ఈ సినిమా దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 12న డిజిటల్ ప్రీమియర్ గా రిలీజ్ అయ్యింది. ఇక డిజిటల్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి స్పందనను దక్కించుకుంది. మంచి రివ్యూస్ తోడవ్వడంతో ఇండియాలో టాప్‌లో ట్రెండిగ్ అయ్యింది. అది అలా ఉంటే ఈ సినిమాకు అరుదైన గౌవరం దక్కింది. ‘సూరారై పొట్రూ’ సినిమా ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికైంది. అందులో భాగంగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో లాస్ ఏంజెల్స్‌లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. దీనికి సంబంధించి 2 డీ ఎంటర్టైన్మెంట్ నిర్మాత రాజ్‌సేకర్ పాండియన్ ఈ తియ్యటి వార్తను అభిమానులతో పంచుకునేందుకు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.


    ఇక అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా అక్కడ దుమ్ముదులుపుతోంది. చాలా సంవత్సరాల తర్వాత సూర్యకు సాలీడ్ హిట్ పడిందని అంటున్నారు. మహా పాత్రలో సూర్య ఇరగదీశాడని అంటున్నారు. ఈ సినిమాలో సూర్య పాత్రకు టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్ డబ్బింగ్ అదరగొట్టాడు. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ఆకాశం నీ హ‌ద్దురా'లో సూర్య‌కు జంటగా అప‌ర్ణ బాల‌ముర‌ళి న‌టించ‌గా ఇతర ముఖ్య పాత్రల్లో మోహ‌న్‌బాబు, ప‌రేష్ రావ‌ల్‌, ఊర్వ‌శి నటించారు. ఇక ఆ మధ్య సూర్య బర్త్ డే కానుకగా వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివసల్ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వెట్రిమారన్ ఇటీవల ధనుష్‌తో అసురన్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అవ్వడంతో తెలుగులో నారప్పగా రీమేక్ చేస్తున్నారు. విక్టరి వెంకటేష్ హీరోగా చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఇటీవల టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను అందుకుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Suriya, Tollywood news

    తదుపరి వార్తలు