హోమ్ /వార్తలు /సినిమా /

Suriya : సూర్య ఆకాశం నీ హద్దురా.. విడుదల వాయిదా..

Suriya : సూర్య ఆకాశం నీ హద్దురా.. విడుదల వాయిదా..

ఆకాశం నీ హద్దురా: సూర్య హీరోగా సుధ కొంగర తెరకెక్కించిన సినిమా ఆకాశం నీ హద్దురా. ఈ మధ్య కాలంలో ఓటిటిలో బిగ్గెస్ట్ హిట్ ఇదే. సూర్యకు చాలా రోజుల తర్వాత వచ్చిన అద్భుతమైన విజయం ఇది.

ఆకాశం నీ హద్దురా: సూర్య హీరోగా సుధ కొంగర తెరకెక్కించిన సినిమా ఆకాశం నీ హద్దురా. ఈ మధ్య కాలంలో ఓటిటిలో బిగ్గెస్ట్ హిట్ ఇదే. సూర్యకు చాలా రోజుల తర్వాత వచ్చిన అద్భుతమైన విజయం ఇది.

Suriya : బందోబస్త్ తర్వాత సూర్య నటిస్తున్న కొత్త చిత్రం ఆకాశం నీ హద్దురా.. త‌మిళంలో 'సూరారై పొట్రు'గా తెరకెక్కింది.

  బందోబస్త్ తర్వాత సూర్య నటిస్తున్న కొత్త చిత్రం ఆకాశం నీ హద్దురా.. త‌మిళంలో 'సూరారై పొట్రు'గా తెరకెక్కింది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సూర్యతో పాటు మోహన్ బాబు కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు. మే 1న ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ, భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. సూర్య నిర్మిస్తూ నటించిన ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా కనిపిస్తోంది. గతంలో వెంకటేష్ తో గురు చిత్రాన్ని తెరకెక్కించిన మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. హిందీలో ఈ మూవీని షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.  కాగా కరోనా కారణంగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ ప్రీమియర్ గా రిలీజ్ కానుంది. వినాయక చవితి సందర్భంగా సూర్య ఈ ప్రకటన చేశాడు. ఆకాశం నీ హద్దురా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 30 వ తారీఖున స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని విధంగా విడుదల వాయిడాపడింది. ఈ విషయాన్ని సూర్య స్వయంగా వెల్లడించారు. కారణం ఈ సినిమా విమానయాన రంగానికి చెందిన కథ కావడంతో టీమ్ నిజమైన ఎయిర్ ఫోర్స్ లొకేషన్లలో, నిజమైన విమానాలతో చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రీకరణ కోసం విమానయాన రంగం నుండి, దేశ భద్రతా విభాగం నుండి అనేక అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది.

  అందులో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త అనుమతులు తీసుకుంటూ చాలా క్లిష్ట పరిస్థితుల్లో చిత్రీకరణ ముగించింది చిత్రబృందం. అంతా పూర్తి చేసి విడుదల చేద్దామని అనుకుంటే థియేటర్లు మూతబడటంతో చివరికి అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే విడుదలకు విమానయాన శాఖ నుండి కొన్ని ఎన్ఓసీలు రావాల్సి ఉందట. దీంతో ఆలస్యమయ్యేలా ఉండటంతో 30వ తేదీన విడుదల లేదని, వాయిదా వేస్తున్నామని.. సహకరించాలని సూర్య లేఖ ద్వారా కోరారు. ఇక కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది కూడ ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో సూర్య పాత్రకు టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పాడని టాక్.

  తెలుగు వెర్షన్‌లో సత్యదేవ్ వాయిస్ సూర్య రోల్ కు ఎంతవరకు సరిపోతుందో అని ఆసక్తిగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ఆకాశం నీ హ‌ద్దురా'లో సూర్య‌కు జంటగా అప‌ర్ణ బాల‌ముర‌ళి న‌టించ‌గా ఇతర ముఖ్య పాత్రల్లో మోహ‌న్‌బాబు, ప‌రేష్ రావ‌ల్‌, ఊర్వ‌శి నటించారు. ఇక ఈ మధ్యే సూర్య బర్త్ డే కానుకగా వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివసల్ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వెట్రిమారన్ ఇటీవల ధనుష్‌తో అసురన్ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అవ్వడంతో తెలుగులో నారప్పగా రీమేక్ చేస్తున్నారు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Suriya, Tollywood news

  ఉత్తమ కథలు