Home /News /movies /

SURIYA SOORARAI POTTRU AAKASAM NEE HADDURA MOVIE OFFICILLAY REMAKE IN BOLLYWOOD WITH SURIYA SUDHA KONGARA TA

Suriya - Soorarai Pottru: బాలీవుడ్‌లో రీమేక్ కానున్న సూర్య ‘ఆకాశం నీ హద్దురా’.. అఫీషియల్ ప్రకటన..

హిందీలో రీమేక్ కానున్న సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ (Twitter/Photo)

హిందీలో రీమేక్ కానున్న సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ (Twitter/Photo)

Suriya - Soorarai Pottru - Aakasam Nee Haddura ఒక భాషలో హిట్టైయిన చిత్రాన్ని వేరే భాషలో రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. తాజాగా తెలుగుతో పాటు తమిళంలో ఓటీటీ వేదికగా విడుదలై సూపర్ హిట్ అనిపించుకున్న ‘సూరరై పొట్రు’ అదేనండి ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.

ఇంకా చదవండి ...
    Suriya - Soorarai Pottru - Aakasam Nee Haddura ఒక భాషలో హిట్టైయిన చిత్రాన్ని వేరే భాషలో రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటి వరకు ఓటీటీ వేదికగా విడుదలైన ఏ సినిమాలు కూడా పూర్తి స్థాయి పాజటివ్ టాక్ రాలేదు. కానీ సూర్య నటించిన ‘సూరారై పొట్రు’ చిత్రం హిట్ కాదు ఏకంగా బ్లాక్ బస్టర్  అనిపించుకుంది. ఈ పినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలై ఇక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాను హిందీలో అఫీషియల్‌గా రీమేక్ చేస్తున్నట్టు ఈ సినిమాలో హీరోగా నటించిన సూర్య ప్రకటించారు. ఈ చిత్రంతో సూర్య హిందీలో నిర్మాతగా అడుగుపెట్టనున్నారు. గతంలో ‘రక్త చరిత్ర -2’తో బాలీవుడ్‌లో నటుడిగా అడుగుపెట్టిన సూర్య.. ఇపుడు నిర్మాతగా తన సత్తా చూపించాలనుకుంటున్నారు.

    ఈ చిత్రాన్ని సూర్య, అబుడాంటియా ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ హిందీ రీమేక్‌ను కూడా సుధ కొంగర డైరెక్ట్ చేయనున్నారు.గతంలో సుధ కొంగర.. మాధవన్‌తో హిందీలో ‘సాలా ఖడూస్’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు.

    మరి హిందీ రీమేక్‌లో హీరోగా ఎవరు నటిస్తారనేది మాత్రం వెల్లడించలేదు. మరోవైపు అమెజాన్ ప్రైమ్‌లో హిందీలో ‘ఉడాన్’ పేరుతో ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేశారు. మరి హిందీ ప్రేక్షకులు డబ్బింగ్ రూపంలో చూసిన ఈ సినిమాను ఏ మేరకు ఆదరిస్తారనేది చూడాలి. ఈ సినిమాను  దక్కన్ ఎయిర్ వేస్ అధినేత ఆర్.గోపీనాథ్ గురించి రాసిన ‘సింప్లి ఫ్లై’ పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. దీనికి సుధ కొంగర కొన్ని సినిమాటిక్ మార్పులు చేర్పులు చేసారు. మొత్తంగా తెలుగు, తమిళ ప్రేక్షకులతో భళా అనిపించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Aakasam Nee Haddura, Bollywood news, Kollywood, Sudha Kongara, Suriya, Tollywood

    తదుపరి వార్తలు