Home /News /movies /

SURIYA SENSATIONAL SINGAM YAMUDU 2 MOVIE COMPLETED 8 YEARS AND HERE THE FULL COLLECTIONS PK

Suriya Singam: 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న సూర్య ‘సింగం’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..

సూర్య సింగం సినిమాకు 8 ఏళ్ళు పూర్తి (Suriya Yamudu 2)

సూర్య సింగం సినిమాకు 8 ఏళ్ళు పూర్తి (Suriya Yamudu 2)

Suriya Singam: సూర్యకు(Suriya) తమిళంలోనే కాదు తెలుగులోనూ అద్భుతమైన ఇమేజ్ ఉంది. మార్కెట్ ఇక్కడ కూడా బాగానే సంపాదించుకున్నాడు సూర్య. అందుకే ఈయన సినిమాలు తెలుగులోనూ మంచి అంచనాలతోనే వస్తుంటాయి. పైగా సింగం సిరీస్ అంటే తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది.

ఇంకా చదవండి ...
సూర్యకు తమిళంలోనే కాదు తెలుగులోనూ అద్భుతమైన ఇమేజ్ ఉంది. మార్కెట్ ఇక్కడ కూడా బాగానే సంపాదించుకున్నాడు సూర్య. అందుకే ఈయన సినిమాలు తెలుగులోనూ మంచి అంచనాలతోనే వస్తుంటాయి. పైగా సింగం సిరీస్ అంటే తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా యముడు సినిమా సూర్య కెరీర్ కష్టాల్లో ఉన్నపుడు వచ్చి సంచలన విజయం సాధించింది. ఆ సినిమా వచ్చిన మూడేళ్ళకు సింగం 2 వచ్చింది. తెలుగులో యముడు 2 కాకుండా సింగం పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేసారు. ఇందులో అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఆమెతో పాటు రెండో భాగంలో హన్సిక చేరింది. తొలి భాగం ఎక్కడ ముగించాడో.. అక్కడ్నుంచే రెండో భాగం మొదలు పెట్టాడు దర్శకుడు హరి. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సింగం మంచి విజయం సాధించింది.

యముడుతో పోలిస్తే కాస్త తక్కువ వసూళ్ళే వచ్చినా కూడా భారీ పోటీ మధ్య వచ్చి విజయం సాధించింది సింగం. ముఖేష్ రుషి, సీనియర్ నటుడు రెహమాన్ విలనిజం సింగం సినిమాకు హైలైట్. 2013, జులై 5న విడుదలైన సింగం 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.

suriya,suriya twitter,suriya singam movie collections,suriya singam movie 8 years,suriya yamudu 2 movie hari 8 years,suriya yamudu 2 movie collections life time,సూర్య యముడు 2,సూర్య సింగం సినిమాకు 8 ఏళ్ళు పూర్తి
సూర్య సింగం సినిమాకు 8 ఏళ్ళు పూర్తి (Suriya Yamudu 2)


నైజాం: 3.45 కోట్లు
సీడెడ్: 1.98 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.34 కోట్లు
ఈస్ట్: 0.69 కోట్లు
వెస్ట్: 0.51 కోట్లు
గుంటూరు: 0.92 కోట్లు
కృష్ణా: 0.72 కోట్లు
నెల్లూరు: 0.49 కోట్లు

ఏపీ + తెలంగాణ: 10.01 కోట్లు

[caption id="attachment_942896" align="alignnone" width="1280"]suriya,suriya twitter,suriya singam movie collections,suriya singam movie 8 years,suriya yamudu 2 movie hari 8 years,suriya yamudu 2 movie collections life time,సూర్య యముడు 2,సూర్య సింగం సినిమాకు 8 ఏళ్ళు పూర్తి సూర్య సింగం సినిమాకు 8 ఏళ్ళు పూర్తి (Suriya Yamudu 2)[/caption]

యముడు సినిమా పెద్దగా అంచనాలు లేకుండానే వచ్చింది. 2010లోనే ఈ చిత్రం 10.8 కోట్లు షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత మూడేళ్ళకు భారీ అంచనాలతో వచ్చిన సింగం 2 తెలుగులో కాస్త తక్కువ వసూళ్లే తీసుకొచ్చింది. దానికి కారణం అదే సమయంలో తెలుగులోనూ పెద్ద సినిమాలు విడుదల కావడమే. దాంతో సింగం వసూళ్లపై ప్రభావం పడింది. 7.8 కోట్ల బిజినెస్ చేసిన సింగం.. 10 కోట్లకు పైగా వసూలు చేసి 2 కోట్లకు పైగా లాభాలను బయ్యర్లకు అందించింది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Suriya, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు