హోమ్ /వార్తలు /సినిమా /

Suriya | ET Trailer : మాస్ టచ్‌తో సూర్య ఈటి ట్రైలర్‌.. సోషల్ మీడియాలో ట్రెండింగ్..

Suriya | ET Trailer : మాస్ టచ్‌తో సూర్య ఈటి ట్రైలర్‌.. సోషల్ మీడియాలో ట్రెండింగ్..

Suriya ET Trailer Photo : Twitter

Suriya ET Trailer Photo : Twitter

Suriya | ET Trailer : జైభీమ్ తర్వాత సూర్య నటిస్తున్న మరో సినిమా ఈటి Etharkkum Thunindhavan (ఎతర్‌క్కుమ్‌ తునిందవన్). ఈ సినిమాను మార్చి 10న విడుదల చేయనున్నారు. దీంతో ప్రచారంలో భాగంగా ఇప్పటికే తెలుగు టీజర్‌ను విడుదల చేసింది టీమ్. ఇక తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. పక్కా మాస్ అండ్ యాక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు పాండి రాజ్ తెరకెక్కించినట్టు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

  తమిళ నటుడు సూర్య  (Suriya) గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు.. తన సినిమా గజనితో తెలుగు వారి హ‌ృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు గజని రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. ఇటీవల సూర్య నటించిన మరో చిత్రం జై భీమ్ (Jai Bhim). సూర్య 40వ సినిమాగా రూపొందిన ఈ చిత్రంలో సూర్య లాయర్ పాత్రలో నటించారు. జై భీమ్’ సినిమా అడివి బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇందులో సూర్య అడవి బిడ్దల తరుపున న్యాయ పోరాటం చేసే వకీల్ సాబ్ పాత్రలో కనిపించి అదరగొట్టారు. ఇక జైభీమ్ తర్వాత సూర్య నటిస్తున్న మరో సినిమా ఈటి Etharkkum Thunindhavan (ఎతర్‌క్కుమ్‌ తునిందవన్). ఈ సినిమాను మార్చి 10న విడుదల చేయనున్నారు. దీంతో ప్రచారంలో భాగంగా ఇప్పటికే తెలుగు టీజర్‌ను విడుదల చేసింది టీమ్. ఇక తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. పక్కా మాస్ అండ్ యాక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు పాండి రాజ్ తెరకెక్కించినట్టు తెలుస్తోంది. మాంచి మాస్ ఎలిమెంట్స్‌లో ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. సూర్యకు ఈ సినిమా రూపంలో మరో మాస్ హిట్ దొరికేలా ఉంది. ఈ ట్రైలర్ లో మరో హైలైట్‌‌ డి ఇమ్మాన్ ఇచ్చిన బ్యాగ్ గ్రౌండ్ స్కోర్. ఈ తెలుగు ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. మార్చ్ 10న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాలో వినయ్‌రామ్‌, సత్యరాజ్‌, జయప్రకాశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

  ఈ సినిమా ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళీ భాషల్లో కూడా విడుదల కానుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి సంబంధించి తెలుగు వెర్షన్ కి సూర్య స్వయంగా తన డబ్బింగ్ ని తానే చెప్పుకుంటున్నారు. ఇక సూర్య గతంలో “బ్రదర్స్” అనే సినిమాకు డబ్బింగ్ చెప్పుకున్నారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ చిత్రానికి ఆయన స్వయంగా డబ్బింగ్ చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి తెలుగు హక్కులను ఏసియన్ సినిమాస్ (Asian Cinemas) దక్కించుకుంది. సూర్యకి జోడిగా నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటిస్తున్నారు.

  ఇక జైభీమ్ కంటే ముందు సూర్య నటించిన మరో బ్లాక్ బస్టర్ (Soorarai Pottru) 'సూరారై పొట్రు'. ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా... పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే ఓ మైలు రాయిగా నిలిచింది. కరోనా కారణంగా ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు 'ఆస్కార్' రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుద‌లైన ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అంతేకాదు కొన్నేళ్లుగా ఫ్లాప్‌ల‌తో డీలా ప‌డ్డ సూర్య‌కు ఈ చిత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ చిత్రాన్ని కూడా 2డీ ఎంట‌ర్‌టైన్మెంట్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మించారు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Hero suriya, Tollywood news, Vijay Devarakonda

  ఉత్తమ కథలు