తమిళ నటుడు సూర్య (Suriya) గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు.. తన సినిమా గజనితో తెలుగు వారి హృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు గజని రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. ఇటీవల సూర్య నటించిన మరో చిత్రం జై భీమ్ (Jai Bhim). సూర్య 40వ సినిమాగా రూపొందిన ఈ చిత్రంలో సూర్య లాయర్ పాత్రలో నటించారు. జై భీమ్’ సినిమా అడివి బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇందులో సూర్య అడవి బిడ్దల తరుపున న్యాయ పోరాటం చేసే వకీల్ సాబ్ పాత్రలో కనిపించి అదరగొట్టారు. ఇక జైభీమ్ తర్వాత సూర్య నటిస్తున్న మరో సినిమా ఈటి Etharkkum Thunindhavan (ఎతర్క్కుమ్ తునిందవన్). ఈ సినిమాను మార్చి 10న విడుదల చేయనున్నారు. దీంతో ప్రచారంలో భాగంగా ఇప్పటికే తెలుగు టీజర్‌ను విడుదల చేసింది టీమ్. పక్కా మాస్ అండ్ యాక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు పాండి రాజ్ తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇక ట్రైలర్‌కు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా తెలుగుట్రైలర్ ని మార్చ్ 2 ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది టీమ్. ఈ సినిమాలో వినయ్‌రామ్, సత్యరాజ్, జయప్రకాశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళీ భాషల్లో కూడా విడుదల కానుంది. ఇక ప్రచారంలో భాగంగా మూడో తెలుగు లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. "సిలుకు జుబ్బా స్మార్టు .. పెట్టేశావే స్పాటు .. పొడవకురో గుండెల్లోనా పోటు" అంటూ సాగే ఈ పాటను వనమాలి రాయగా.. హరిచరణ్, శ్రీనిధి పాడారు. ఇమ్మాన్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో, సత్యరాజ్, శరణ్య, రాజ్ కిరణ్, సూరి ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇక ఈ సినిమా గురించి మరో విశేషం ఏమంటే.. ఈ చిత్రానికి సంబంధించి తెలుగు వెర్షన్ కి సూర్య స్వయంగా తన డబ్బింగ్ ని తానే చెప్పుకుంటున్నారు. ఇక సూర్య గతంలో “బ్రదర్స్” అనే సినిమాకు డబ్బింగ్ చెప్పుకున్నారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ చిత్రానికి ఆయన స్వయంగా డబ్బింగ్ చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి తెలుగు హక్కులను ఏసియన్ సినిమాస్ (Asian Cinemas) దక్కించుకుంది. ఈటిని పాండిరాజ్ తెరకెక్కిస్తుండగా... సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. సూర్యకి జోడిగా నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు.
A pakka commercial treat on the way ?#ETtrailer is releasing Tomorrow at 11 AM ?@Suriya_offl @pandiraj_dir #Sathyaraj @immancomposer @RathnaveluDop @priyankaamohan @VinayRai1809 @sooriofficial @AntonyLRuben #EtharkkumThunindhavan #ETtrailerFromTomorrow pic.twitter.com/FlPPiL1rLi
— Sun Pictures (@sunpictures) March 1, 2022
ఇక జైభీమ్ కంటే ముందు సూర్య నటించిన మరో బ్లాక్ బస్టర్ (Soorarai Pottru) 'సూరారై పొట్రు'. ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా... పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమా సూర్య కెరీర్లోనే ఓ మైలు రాయిగా నిలిచింది. కరోనా కారణంగా ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు 'ఆస్కార్' రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అంతేకాదు కొన్నేళ్లుగా ఫ్లాప్‌లతో డీలా పడ్డ సూర్యకు ఈ చిత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ చిత్రాన్ని కూడా 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero suriya, Tollywood news