హోమ్ /వార్తలు /సినిమా /

‘ఆకాశమే నీ హద్దురా’ అంటున్న సూర్య.. ఈ సారైనా హిట్టు కొడతాడా..

‘ఆకాశమే నీ హద్దురా’ అంటున్న సూర్య.. ఈ సారైనా హిట్టు కొడతాడా..

సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ ఫస్ట్ లుక్ విడుదల (twitter/Photo)

సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ ఫస్ట్ లుక్ విడుదల (twitter/Photo)

 తమిళ స్టార్ హీరోకు తమిళంలో పాటు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండేది. గతకొన్నేళ్లుగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది.  ఈ మధ్యన సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగా పర్ఫామ్ చేయడం లేదు. తాజాగా సూర్య మరో సినిమాకు ఓకే చెప్పాడు.   తమిళ స్టార్ హీరోకు తమిళంలో పాటు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండేది. గతకొన్నేళ్లుగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది.  ఈ మధ్యన సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగా పర్ఫామ్ చేయడం లేదు. వరుస ఫెయిల్యూర్స్‌తో తెలుగులో సూర్య మార్కెట్ క్రమంగా పడిపోయింది. ఈ ఇయర్ సూర్య నటించిన ‘NGK’, ‘బందోబస్త్’ సినిమాలకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదంటూ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇపుడున్న పరిస్థితుల్లో సూర్య ‘గురు’ ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో ‘సూరారై పొట్రు’ అనే తమిళ సినిమాలో నటించడానికి ఓకే చెప్పాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్‌లో స్లీవ్ లెస్ టీ షర్టు వేసుకొని.. గాల్లో ఎగురుతూ ఉన్న సూర్య పోస్టర్ బాగుంది. అంతేకాదు గాల్లో గాగుల్స్‌తో సూర్య లుక్స్ ట్రెండీగా ఉంది. తెలుగులో  ఈ సినిమాకు ‘ఆకాశమే నీ హద్దురా’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.


  suriya new movie aakaasam nee haddhu ra title and first look released,suriya,suriya new movie, aakaasam nee haddhu ra,suriya aakaasam nee haddhu ra,suriya twitter,suriya instagram,suriya facebook,mohan babu twitter,mohan babu instagram,mohan babu facebook,mohan babu,surya sudha kongara,sudha kongara,suriya,surya- sudha kongara - surya 38,mohan babu new movie,suriya - sudha kongara movie update,suriya about mohan babu,surya,suriya 38 story,mohan babu as villain in suriya film,soorarai pottru suriya film,mohan babu movies,mohan babu speech,surya and mohan babu thanks to each other,mohan babu interview,mohan babu as villain,suriya mohan babu movie,kollywood,tollywood,Soorarai Pottru FirstLook,SooraraiPottru,ఆకాశమే నీ హద్దురా,సూర్య,మోహన్ బాబు,సూర్య ఆకాశమే నీ హద్దురా మూవీ టైటిల్ రిలీజ్,సూర్య ఫస్ట్ లుక్,సూర్య మోహన్ బాబు సుద కొంగర
  ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల (Twtitter/Photo)


  అప్పట్లో సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘సొమ్మొకడిది సోకొకడిది’ సినిమాలో ఉన్న ఆకాశమే నీ హద్దురా పాటను ఈ సినిమా టైటిల్‌గా పెట్టారు. ఈ చిత్రాన్ని ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.  ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో అపర్ణ..జాకీష్రాఫ్,పరేష్ రావల్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ  సినిమాను 2D ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మిస్తున్నాడు. వచ్చే యేడాది సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.


  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Kollywood, Mohan Babu, Sudha Kongara, Suriya, Tamil Cinema, Tollywood

  ఉత్తమ కథలు