Home /News /movies /

SURIYA NEW 40TH MOVIE ETHARKKUM THUNINDHAVAN TITLE TEASER RELEASED DUE TO HIS BIRTHDAY TA

Suriya: కొత్త అవతారంలో సూర్య.. పుట్టినరోజు కానుకగా అదిరిన టీజర్..

సూర్య కొత్త మూవీ లుక్ (Youtube/Photo)

సూర్య కొత్త మూవీ లుక్ (Youtube/Photo)

తాజాగా సూర్య .. సన్ పిక్చర్స్ నిర్మాణంలో ‘ఎతర్కుమ్ తునిందవన్’ సినిమా చేస్తున్నారు. ఈ శుక్రవారం సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసారు.

    Suriya | గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని సూర్య గతేడాది ఈయన నటించిన  ‘సూరారై పొట్రు’ సినిమాను థియేటర్స్‌లో కాకుండా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసి హిట్ అందుకున్నారు. సుధ కొంగర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సూర్య నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో ఒకేసారి తమిళంలో పాటు తెలుగులో అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేసారు. ఇక్కడ కూడా ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇపుడు ఈ సినిమాను హిందీలో అక్షయ్ కుమార్‌‌తో బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా సూర్య .. సన్ పిక్చర్స్ నిర్మాణంలో ‘ఎతర్కుమ్ తునిందవన్’ సినిమా చేస్తున్నారు. ఈ శుక్రవారం సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసారు. విడుదలైన ఈ  సినిమా టీజర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.
    ఈ చిత్రంలో సూర్య సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్టేనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి రత్నవేలు ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Kollywood, Suriya, Tollywood

    తదుపరి వార్తలు