సూర్య ‘ఆకాశమే నీ హద్దురా’ టీజర్ టాక్.. మోహన్ బాబు వాయిస్ ఓవర్‌తో..

ప్రస్తుతం సూర్య ‘గురు’ ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో ‘సూరారై పొట్రు’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నాడు. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ అనే టైటిల్‌తో రాబోతుంది. ఇ ప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌‌ను విడుదల చేసారు.

news18-telugu
Updated: January 8, 2020, 11:15 AM IST
సూర్య ‘ఆకాశమే నీ హద్దురా’ టీజర్ టాక్.. మోహన్ బాబు వాయిస్ ఓవర్‌తో..
ఆకాశం నీ హద్దురా (Youtube/Photo)
  • Share this:
తమిళ స్టార్ హీరో సూర్యకు తమిళంలో పాటు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండేది. గతకొన్నేళ్లుగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఈ మధ్యన సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగా పర్ఫామ్ చేయడం లేదు. వరుస ఫెయిల్యూర్స్‌తో తెలుగులో సూర్య మార్కెట్ క్రమంగా పడిపోయింది. గతేడాది సూర్య నటించిన ‘NGK’, ‘బందోబస్త్’ సినిమాలకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు ప్రస్తుతం సూర్య ‘గురు’ ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో ‘సూరారై పొట్రు’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నాడు. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ అనే టైటిల్‌తో రాబోతుంది. ఇ ప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌‌ను విడుదల చేసారు.


ఈ టీజర్ మోహన్ బాబు వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైంది. ఒక ఎయిర్‌లైన్స్ సర్వీస్ ప్రారంభించాలనే ఓ సామాన్య వ్యక్తి.. ఒక అసామాన్య శక్తిగా ఎలా ఎదిగాడన్నదే ఈ సినిమా స్టోరీ. మోహన్ బాబు ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో అపర్ణ..జాకీష్రాఫ్,పరేష్ రావల్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ  సినిమాను 2D ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మిస్తున్నాడు. ఈ యేడాది సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
First published: January 8, 2020, 11:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading