Home /News /movies /

SURIYA MAKES AMITABH BACHCHAN CRY A EMOTIONAL NOTE GOES VIRAL SR

Suriya | Amitabh Bachchan : అమితాబ్ బచ్చన్‌ను ఏడిపించిన సూర్య.. వైరల్ అవుతోన్న సోషల్ మీడియా పోస్ట్..

Suriya, Amitabh Bachchan Photo : Twitter

Suriya, Amitabh Bachchan Photo : Twitter

Suriya | Amitabh Bachchan : తమిళ నటుడు సూర్య గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు.. తన సినిమా గజనితో తెలుగు వారి హ‌ృదయాలను దోచుకున్నారు సూర్య. అయితే ఆయన నటించిన ఓ సినిమా గురించి బిగ్ బీ అమితాబ్ ఏమోషనల్ అయ్యారు.

  తమిళ నటుడు సూర్య గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు.. తన సినిమా గజనితో తెలుగు వారి హ‌ృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు గజని రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. ఇటీవల సూర్య నటించిన మరో బ్లాక్ బస్టర్ (Soorarai Pottru) 'సూరారై పొట్రు'. ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా... పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే ఓ మైలు రాయిగా నిలిచింది. కరోనా కారణంగా ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.

  అంతేకాదు 'ఆస్కార్' రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంటోంది. ఇక తాజాగా ఈ సినిమాను హిందీ సినిమా లెజెండ్ అమితాబ్ బచ్చన్ మెచ్చుకున్నారు.

  ఈ సినిమాపై తాజాగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) షేర్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సినిమాలోని 'కాయిలే ఆకాశం' (Kaiyilae Aagasam)అనే సాంగ్ ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అమితాబ్ భావోద్వేగానికి గురయ్యారు. చిత్రబృందాన్ని ప్రశంసించారు. ఆ పాటను గీత రచయిత యుగభారతి రాయగా జీవీ ప్రకాష్ భార్య సైంధవి పాడారు.

  ఇక అమితాబ్ పోస్ట్ పై హీరో సూర్య స్పందించారు. 'సూరారై పొట్రు'కు ఇలాంటి అద్భుతమైన ప్రశంసలు, మాటలే గ్రేటెస్ట్ రివార్డులు అని, అమితాబ్ మాటలు తన మనసుని టచ్ చేశాయని అన్నారు.


  ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. గత సంవత్సరం నవంబ‌ర్ 12న ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుద‌లైన ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అంతేకాదు కొన్నేళ్లుగా ఫ్లాప్‌ల‌తో డీలా ప‌డ్డ సూర్య‌కు ఈ చిత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

  క‌థ మొద‌లు ప్ర‌ధాన పాత్రాధారుల న‌ట‌న‌, స్క్రీన్ ప్లే, సుధా కొంక‌ర ద‌ర్శ‌క‌త్వం, జీవీ ప్ర‌కాష్ సంగీతం, నిర్మాణ విలువ‌లు అన్నీ ఈ సినిమాకు ప్ల‌స్‌గా మారాయి. అంతర్జాతీయ సినిమా రివ్యూ సంస్థ 'ఐఎండీబీ'లో అత్యధిక రేటింగ్ వచ్చిన మూడో సినిమాగా రికార్డ్‌ నెలకొల్పింది. 'ఆకాశం నీ హ‌ద్దురా'లో సూర్య‌కు జంటగా అప‌ర్ణ బాల‌ముర‌ళి న‌టించ‌గా ఇతర ముఖ్య పాత్రల్లో మోహ‌న్‌బాబు, ప‌రేష్ రావ‌ల్‌, ఊర్వ‌శి నటించారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంట‌ర్‌టైన్మెంట్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మించారు.

  ఇక సూర్య నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. (Jai Bhim) జై భీమ్.. ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో సూర్య లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు. అణగారిన, పేదల కోసం పాటుపడే లాయర్ పాత్రలో సూర్య ఈ సినిమాలో నటిస్తున్నారు.

  జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక దంపతులు నిర్మాణం వహిస్తున్నారు. ‘జై భీమ్’ సినిమా అడివి బిడ్డలకు, కార్పోరేట్ శక్తులకు మధ్య జరిగే పోరాట నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో సూర్య అడవి బిడ్దల తరుపున న్యాయ పోరాటం చేసే వకీల్ సాబ్ పాత్రలో కనిపించనున్నారు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Amitabh bachchan, Suriya, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు