Suriya : తమిళ హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. సూర్య 2007-2009 ఆర్ధిక సంవత్సరాలకు గాను ఆదాయపు పన్ను విధించే వడ్డీ నుంచి మినహాయింపు కోరుతు 2018లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2010లో ఆదాయపు పన్ను అధికారులు సూర్య తన ఆదాయానికి తగ్గట్టు పన్నులు చెల్లించం లేదనే కారణంతో 2010లో ఏక కాలంలో సూర్యకు సంబంధించిన ఇళ్లు వ్యాపార స్థలాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో లెక్కల్లో లేని పలు ఆదాయాలకు సంబంధించి మొత్తం రూ. 3.11 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. ఆదాయపు పన్ను అధికారులు జారీ చేసిన నోటీసులో వడ్డీ మినహాయించాలని కోరుతూ సూర్య మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు మాత్రం సెలబ్రిటీగా ఉన్నత స్థానంలో ఉన్న మీలాంటి వ్యక్తులు మిగతా వారికి ఆదర్శంగా ఉండాలని తలంటు పోసింది. అంతేకాదు.. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చింది.
ఈ మంగళవారం జస్టిస్ ఎస్ఎం సుబ్రమణ్యం ఆదాయపు పన్ను శాఖ వాదనలు విన్న తర్వాత సూర్య ఇన్టాక్స్కు సంబంధించి సదరు అధికారులకు సహకరించలేదని సదురు పిటిషన్ కొట్టివేసింది. మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే ముందు సూర్య ముందుగా ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో ఇనటాక్స్ అధికారులు తనకు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేశారు. అయితే అక్కడ కూడా సూర్యకు భంగపాటు తప్పలేదు. ఇన్‌టాక్స్ డిపార్ట్మెంట్ జారీ చేసిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని సదరు ట్రిబ్యులేట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు ఇవ్వడానికి ఆదాయపు పన్ను ట్రిబ్యునల్‌కు దాదాపు మూడేళ్ల సమయం పట్టింది. ఆ తర్వాత 2018లో ఆదాయపు పన్నుకు వడ్డీ మినహాయించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు సూర్యకు వడ్డీతో సహా ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.