Home /News /movies /

SURIYA LATEST FILM JAI BHIM TO STREAM ON AMAZON PRIME SR

Suriya : అమెజాన్ ప్రైమ్‌లో సూర్య మరో సినిమా.. అధికారిక ప్రకటన...

Suriya Jai Bhim on amazon prime Photo : Twitter

Suriya Jai Bhim on amazon prime Photo : Twitter

Suriya : నటుడు సూర్య గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు.. తన సినిమా గజనితో తెలుగు వారి హ‌ృదయాలను దోచుకున్నారు.

    నటుడు సూర్య గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు.. తన సినిమా గజనితో తెలుగు వారి హ‌ృదయాలను దోచుకున్నారు. తెలుగులో మొదటి సారి సూర్యకు గజని రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. ఇటీవల సూర్య నటించిన మరో బ్లాక్ బస్టర్ సినిమా ఆకాశం నీ హద్దురా... ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే ఓ మైలు రాయిగా నిలిచింది. కరోనా కారణంగా ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆయన నటిస్తున్న మరో సినిమా జై భీమ్.. ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో సూర్య లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు. అణగారిన మరియు పేదల కోసం పాటుపడే లాయర్ పాత్రలో సూర్య ఈ సినిమాలో నటిస్తున్నట్టు ఈ మూవీ పోస్టర్‌ను చూస్తే  తెలుస్తోంది. అది అలా ఉంటే ఈ సినిమా కూడా డైరెక్ట్’గా ఓటీటీలో విడుదలకానుందట. ఈ విషయాన్ని సూర్య స్వయంగా తెలియజేశారు. వచ్చే నవంబర్ నెలలో ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నట్టుగా సూర్య ప్రకటించారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక దంపతులు నిర్మాణం వహిస్తున్నారు. ‘జై భీమ్’ సినిమా అడివి బిడ్డలకు, కార్పోరేట్ శక్తులకు మధ్య జరిగే పోరాట నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో సూర్య అడవి బిడ్దల తరుపున న్యాయ పోరాటం చేసే వకీల్ సాబ్ పాత్రలో కనిపించనున్నారు.


    ఇక ఆయన గత చిత్రం ఆకాశం నీ హద్దురా.. విషయానికి వస్తే.. ఈ సినిమా త‌మిళంలో 'సూరారై పొట్రు'గా తెరకెక్కింది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య ప్రధాన పాత్ర పోషించారు. గ‌తేడాది కరోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఓటీటీలో విడుద‌లై పెద్ద విజ‌యం సాధించింది. నవంబ‌ర్ 12న ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుద‌లైన ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అంతేకాదు కొన్నేళ్లుగా ఫ్లాప్‌ల‌తో డీలా ప‌డ్డ సూర్య‌కు ఈ చిత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. క‌థ మొద‌లు ప్ర‌ధాన పాత్రాధారుల న‌ట‌న‌, స్క్రీన్ ప్లే, సుధా కొంక‌ర ద‌ర్శ‌క‌త్వం, జీవీ ప్ర‌కాష్ సంగీతం, నిర్మాణ విలువ‌లు అన్నీ ఈ సినిమాకు ప్ల‌స్‌గా మారాయి.

    మరో విషయం ఏమంటే.. అంతర్జాతీయ సినిమా రివ్యూ సంస్థ 'ఐఎండీబీ'లో అత్యధిక రేటింగ్ వచ్చిన మూడో సినిమాగా రికార్డ్‌ నెలకొల్పింది. సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ఆకాశం నీ హ‌ద్దురా'లో సూర్య‌కు జంటగా అప‌ర్ణ బాల‌ముర‌ళి న‌టించ‌గా ఇతర ముఖ్య పాత్రల్లో మోహ‌న్‌బాబు, ప‌రేష్ రావ‌ల్‌, ఊర్వ‌శి నటించారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంట‌ర్‌టైన్మెంట్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మించారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Suriya, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు