హోమ్ /వార్తలు /సినిమా /

సూర్య, కార్తి కాంబినేషన్‌లో అదిరిపోయే మల్టీస్టారర్..

సూర్య, కార్తి కాంబినేషన్‌లో అదిరిపోయే మల్టీస్టారర్..

సూర్య కార్తి మల్టీస్టారర్ (suriya karthi multistarrer)

సూర్య కార్తి మల్టీస్టారర్ (suriya karthi multistarrer)

Suriya Karthi: దక్షిణాదిన సూర్య, కార్తిలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ సమయంలోనే ఇద్దరూ స్టార్స్ అయ్యారు. ఒకర్ని మించి మరొకరు మార్కెట్..

దక్షిణాదిన సూర్య, కార్తిలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ సమయంలోనే ఇద్దరూ స్టార్స్ అయ్యారు. ఒకర్ని మించి మరొకరు మార్కెట్ సంపాదించుకున్నారు. ఈ మధ్య సూర్య కాస్త విజయాల విషయంలో వెనకబడినా కూడా కార్తి మాత్రం కుమ్మేస్తున్నాడు. హిట్స్ కొట్టినా కొట్టకపోయినా కూడా సూర్య ఇమేజ్ మాత్రం అలాగే ఉంది. ప్రస్తుతం అరడజన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు సూర్య. ఇదిలా ఉంటే ఇప్పుడు కార్తి, సూర్య కలిసి మల్టీస్టారర్ ఒకటి చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది.

సూర్య కార్తి మల్టీస్టారర్ (suriya karthi multistarrer)
సూర్య కార్తి మల్టీస్టారర్ (suriya karthi multistarrer)

మలయాళ బ్లాక్‌బస్టర్ అయ్యప్పనుం కోషియుం సినిమాను ఇతర భాషల్లోకి రీమేక్ చేయాలని చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగులో కూడా ఈ చిత్ర రీమేక్ రైట్స్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఇక్కడ వెంకటేష్, రానా హీరోలుగా రీమేక్ చేయాలని చూస్తున్నాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ.

సూర్య కార్తి మల్టీస్టారర్ (suriya karthi multistarrer)
సూర్య కార్తి మల్టీస్టారర్ (suriya karthi multistarrer)

తెలుగులో పృథ్వీరాజ్ పాత్రకు రానా దగ్గుబాటి.. బిజు మీనన్ క్యారెక్టర్‌కు వెంకటేష్ పేర్లు వినిపించాయి. తెలుగులో ఏమో తెలియదు కానీ తమిళనాట మాత్రం ఈ సినిమాను కార్తి, సూర్య హీరోలుగా రీమేక్ చేయబోతున్నారి ప్రచారం జరుగుతుంది. బిజు పాత్రకు సూర్య.. పృథ్వీరాజ్ పాత్రకు కార్తి పేర్లు ప్రముఖంగా ప్రచారంలోకి వస్తున్నాయి. మరి చూడాలిక.. ఈ చిత్రం అక్కడ అన్నాదమ్ములు రీమేక్ చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయం.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Karthi, Suriya, Tamil Cinema, Telugu Cinema

ఉత్తమ కథలు