Home /News /movies /

SURIYA JAI BHIM TOPS GOOGLE CHARTS AS MOST SEARCHED FOR FILM IN 2021 SR

Suriya | Jai Bhim : గూగుల్ సాక్షిగా మరో రికార్డ్‌ను సొంతం చేసుకున్న సూర్య జైభీమ్..

Suriya Jai Bhim Photo : Twitter

Suriya Jai Bhim Photo : Twitter

Suriya | Jai Bhim : నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన జై భీమ్ భారతదేశంలో ఈ ఏడాది ఎక్కువగా సెర్చ్‌ చేసిన చిత్రంగా నిలిచి మరో రికార్డ్ క్రియేట్ చేసింది.

  తమిళ నటుడు సూర్య గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు.. తన సినిమా గజనితో తెలుగు వారి హ‌ృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు గజని రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. తాజాగా సూర్య నటించిన మరో చిత్రం జై భీమ్ (Jai Bhim) . సూర్య 40వ సినిమాగా రూపొందిన ఈ చిత్రంలో సూర్య లాయర్ పాత్రలో నటించారు. జై భీమ్’ సినిమా అడివి బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇందులో సూర్య అడవి బిడ్దల తరుపున న్యాయ పోరాటం చేసే వకీల్ సాబ్ పాత్రలో కనిపించి అదరగొట్టారు. ఈ సినిమాలో లిజో మోల్ జోస్, మణికందన్, రజిషా విజయన్ ప్రధాన పాత్రలు పోషించారు. టీఎస్ జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. తెలుగు నటులు రావు రమేష్ కీలకపాత్ర కనిపించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా మరో కీలక పాత్రలో నటించారురు.

  అది అలా ఉంటే 2021 సంవ‌త్స‌రంలో గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన చిత్రాల్లో సూర్య జైభీమ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత షేర్షా, రాధే, బెల్ బాటమ్, ఎటర్నల్స్ ఉన్నాయి. నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన జై భీమ్ భారతదేశంలో ఈ ఏడాది ఎక్కువగా సెర్చ్‌ చేసిన చిత్రంగా నిలిచింది. ఇక 2021లో మాస్టర్, వలిమై, బీస్ట్, జై భీమ్, వకీల్ సాబ్ చిత్రాల గురించే నెటిజన్లు ఎక్కువగా ట్వీట్లు చేశారు. ఇక జైభీమ్ విషయానికి వస్తే.. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జ్యోతిక, సూర్య ఈ సినిమాని నిర్మించారు. జై భీమ్ దీపావళీ సందర్భంగా నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది.


  ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గిరిజనులు, మ‌హిళ‌ల‌పై పోలీసులు దాడులు చేయ‌డం, లేనిపోని కార‌ణాల‌తో అమాయ‌కుల‌ని వేధిస్తున్న నేప‌థ్యంలో లాయ‌ర్‌గా సూర్య వారికి ఎలా అండ‌గా నిలిచారు అనేది కథాంశం. ఈ సినిమాను 1993లో తమిళనాడులో ఓ గిరిజన యువతి కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు చేసిన పోరాటాన్ని ఆధారంగా చేసుకుని రూపోందించారు. ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సెలెబ్రిటీల దాకా జై కొడుతున్నారు. అంతేకాదు ఈ సినిమా ఐఎండిబిలో టాప్ 250 సినిమాల జాబితాలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుని హాలీవుడ్ రికార్డులను సైతం బ్రేక్ చేసింది. ఇప్పటి వరకూ ఐఎండిబిలో మొదటి స్థానంలో ఉన్న హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ది షాశాంక్ రిడంప్షన్’ను జై భీమ్ దాటింది. జై భీమ్ చిత్రం 9.6 రేటింగ్‌ తో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో రెండవ స్థానంలో ‘ది షాశాంక్ రిడెంప్షన్’ 9.3 రేటింగ్‌తో నిలవగా..మరో హాలీవుడ్ క్లాసిక్ ‘ది గాడ్ ఫాదర్’ 9.2 రేటింగ్‌తో మూడవ స్థానంలో ఉంది.

  Balakrishna | Akhanda : విశాఖలో అఖండ విజయోత్సవ సంబరాలు.. పిక్స్ వైరల్..

  ఇక ఇటీవల సూర్య నటించిన మరో బ్లాక్ బస్టర్ (Soorarai Pottru) 'సూరారై పొట్రు'. ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా... పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే ఓ మైలు రాయిగా నిలిచింది. కరోనా కారణంగా ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.

  అంతేకాదు 'ఆస్కార్' రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంటోంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. గత సంవత్సరం నవంబ‌ర్ 12న ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుద‌లైన ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అంతేకాదు కొన్నేళ్లుగా ఫ్లాప్‌ల‌తో డీలా ప‌డ్డ సూర్య‌కు ఈ చిత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ చిత్రాన్ని కూడా 2డీ ఎంట‌ర్‌టైన్మెంట్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మించారు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Hero suriya, Jai Bhim Movie, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు