Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /సినిమా /

Suriya - Jai Bhim : నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సూర్య ‘జై భీమ్’కు అవార్డుల పంట..

Suriya - Jai Bhim : నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సూర్య ‘జై భీమ్’కు అవార్డుల పంట..

సూర్య ‘జై భీమ్’కు నోయిడా ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డుల పంట (Twitter/Photo)

సూర్య ‘జై భీమ్’కు నోయిడా ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డుల పంట (Twitter/Photo)

గతేడాది సూర్య నటించిన చిత్రం ‘జై భీమ్’ (Jai Bhim).  ఈ మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.  తాజాగా ఈ చిత్రం నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పలు అవార్డులను కైవసం చేసుకుంది.

Suriya - Jai Bhim : తమిళ స్టార్ హీరో సూర్య గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయాలు అక్కర లేదు. మురుగదాస్ దర్శకత్వంలో చేసిన ‘గజని’తో తెలుగు వారి హ‌ృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు గజని రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. ఇక కరోనా కాలంలో  సూర్య నటించిన  (Soorarai Pottru) 'సూరారై పొట్రు'. ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా... పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే ఓ మైలు రాయిగా నిలిచింది. కరోనా కారణంగా ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.

అంతేకాదు 'ఆస్కార్' రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంటోంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.  ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుద‌లైన ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అంతేకాదు కొన్నేళ్లుగా ఫ్లాప్‌ల‌తో డీలా ప‌డ్డ సూర్య‌కు ఈ చిత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

Jayaram Corona Positive : ‘అల వైకుంఠపురములో’ నటుడు జయరామ్‌కు కరోనా పాజిటివ్..

ఇక అది అలా ఉంటే  సూర్య నటించి మరో చిత్రం ‘జై భీమ్’ (Jai Bhim).  గతేడాది.. ప్యాన్ ఇండియా లెవల్లో ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.  ఈ సినిమాలో సూర్య లాయర్ చంద్రూ  పాత్రలో అదరగొట్టారు. అణగారిన, పేదల కోసం పాటుపడే లాయర్ పాత్రలో సూర్య ఈ సినిమాలో అదరగొట్టారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై  అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా ఈ  సినిమాలో లాయర్ చంద్రూగా సూర్య నటన హైలెట్. మిగతా పాత్రల్లో నటించిన వాళ్లు నటించారనే కంటే ఆయా పాత్రలో లీనమై జీవించారు. అందుకే ఈ సినిమాకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

NBK- Akhanda : బాలకృష్ణ ‘అఖండ’ మరో సెన్సేషనల్ రికార్డు.. హైదరాబాద్ ఆర్జీసీ క్రాస్‌ రోడ్‌లో రూ. కోటి కలెక్ట్ చేసిన మూవీ..

అంతేకాదు 2021లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన మూవీగా ‘జై భీమ్’ నిలిచింది. ఇక ఈ సినిమాలోని ఒక సన్నివేశాన్ని ఆస్కార్ అధికారిక యూట్యూబ్ ఛానెల్ ‘సీన్ ఎట్ ది అకాడమీ’ పేరుతో ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని పెట్టారు. ఆస్కార్ (అకాడమీ) యూట్యూబ్ వేదికగా ఒక తమిళ సినిమా వీడియోను ఉంచడం ఇదే ఫస్ట్ టైమ్.

విజయ్ దేవరకొండ ‘లైగర్‌’ సినిమాకు మరో అరుదైన ఘనత.. ‘లైగర్’ మూవీ సైకత శిల్పం..

తాజాగా ’మరక్కార్’తో పాటు ‘జై భీమ్’ సినిమాలు  ఆస్కార్ బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరిలో మన దేశం నుంచి సెలెక్ట్ అయ్యాయి. ఇక  ఈ చిత్రాన్ని 9 నోయిడా అంతర్జాతీయ చిత్రోత్సవంలో 2022లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ‘జై భీమ్’ ఉత్తమ నటుడు, నటి, ఉత్తమ చిత్రం విభాగంలో మూడు అవార్డులు కైవసం చేసుకుంది.

బెస్ట్ యాక్టర్‌గా సూర్య.. సినతల్లి పాత్రలో నటించి లిజ్మోల్ జోస్ బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డులు అందుకున్నారు. మరోవైపు ‘జై భీమ్’  సినిమా ప్రముఖ రేటింగ్ సంస్థ IMDB (Indian Movie Data Base) లో అత్యధిక రేటింగ్ దక్కించుకున్న మూవీగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ఏకంగా IMDBలో 9.6/10 రేటింగ్ దక్కించుకుంది. 53K Likes తో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ‘జై భీమ్’ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా 9.3/10 రేటింగ్‌తో మొదటి స్థానంలో ఉన్న ‘ది షాషాంక్ రిడంప్షన్’ సినిమా రెండో స్థానానికి పడిపోయింది. ఇపుడు ఆ స్థానంలో ‘జై భీమ్’ వచ్చి చేరింది. తాజాగా ఈ సినిమా రేటింగ్ 9.3 దగ్గర స్థిర పడింది.

First published:

Tags: Jai Bhim Movie, Kollywood, Suriya