Suriya - Jai Bhim : తమిళ స్టార్ హీరో సూర్య గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయాలు అక్కర లేదు. మురుగదాస్ దర్శకత్వంలో చేసిన ‘గజని’తో తెలుగు వారి హృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు గజని రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. ఇక కరోనా కాలంలో సూర్య నటించిన (Soorarai Pottru) 'సూరారై పొట్రు'. ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా... పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమా సూర్య కెరీర్లోనే ఓ మైలు రాయిగా నిలిచింది. కరోనా కారణంగా ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.
అంతేకాదు 'ఆస్కార్' రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంటోంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అంతేకాదు కొన్నేళ్లుగా ఫ్లాప్‌లతో డీలా పడ్డ సూర్యకు ఈ చిత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
Allu Arjun - Pushpa : అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ మరో తిరుగులేని రికార్డు.. తగ్గేదేలే అంటున్న బన్ని..
ఇక అది అలా ఉంటే సూర్య నటించి మరో చిత్రం ‘జై భీమ్’ (Jai Bhim). గతేడాది.. ప్యాన్ ఇండియా లెవల్లో ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సూర్య లాయర్ చంద్రూ పాత్రలో అదరగొట్టారు. అణగారిన, పేదల కోసం పాటుపడే లాయర్ పాత్రలో సూర్య ఈ సినిమాలో అదరగొట్టారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో లాయర్ చంద్రూగా సూర్య నటన హైలెట్. మిగతా పాత్రల్లో నటించిన వాళ్లు నటించారనే కంటే ఆయా పాత్రలో లీనమై జీవించారు. అందుకే ఈ సినిమాకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. అంతేకాదు 2021లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన మూవీగా ‘జై భీమ్’ నిలిచింది.
తాాజాగా ఈ సినిమాలోని ఒక సన్నివేశాన్ని ఆస్కార్ అధికారిక యూట్యూబ్ ఛానెల్ ‘సీన్ ఎట్ ది అకాడమీ’ పేరుతో ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని పెట్టారు. ఆస్కార్ (అకాడమీ) యూట్యూబ్ వేదికగా ఒక తమిళ సినిమా వీడియోను ఉంచడం ఇదే ఫస్ట్ టైమ్. తాజాగా ఈ చిత్రాన్ని 9 నోయిడా అంతర్జాతీయ చిత్రోత్సవంలో 2022లో ప్రదర్శించనున్నారు.
Another feather in the cap✨#JaiBhim has been officially selected into the @noidafilmfest @Suriya_offl #Jyotika @tjgnan @rajsekarpandian @2D_ENTPVTLTD @PrimeVideoIN pic.twitter.com/vHdLnOrk1v
— BA Raju's Team (@baraju_SuperHit) January 19, 2022
మరోవైపు ‘జై భీమ్’ సినిమా ప్రముఖ రేటింగ్ సంస్థ IMDB (Indian Movie Data Base) లో అత్యధిక రేటింగ్ దక్కించుకున్న మూవీగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ఏకంగా IMDBలో 9.6/10 రేటింగ్ దక్కించుకుంది. 53K Likes తో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ‘జై భీమ్’ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా 9.3/10 రేటింగ్‌తో మొదటి స్థానంలో ఉన్న ‘ది షాషాంక్ రిడంప్షన్’ సినిమా రెండో స్థానానికి పడిపోయింది. ఇపుడు ఆ స్థానంలో ‘జై భీమ్’ వచ్చి చేరింది. తాజాగా 9.3 పడిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jai Bhim Movie, Kollywood, Suriya, Tollywood