Home /News /movies /

SURIYA JAI BHIM CREATE RECORD THIS MOVIE TOP RATED IMDB RATING WORLD WIDE CINEMA TA

Suriya - Jai Bhim : సూర్య ‘జై భీమ్’ సినిమా మరో అరుదైన రికార్డు.. IMDB రేటింగ్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో..

సూర్య ‘జై భీమ్’ మరో అరుదైన రికార్డు (Twitter/Photo)

సూర్య ‘జై భీమ్’ మరో అరుదైన రికార్డు (Twitter/Photo)

Suriya - Jai Bhim : తమిళ స్టార్ హీరో సూర్య గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయాలు అక్కర లేదు. తాజాగా ఈయన నటించిన ‘జై భీమ్’ సినిమా IMDB రేటింగ్‌లో అరుదైన రికార్డు క్రియేట్ చేసి సంచలనం రేపింది.

Suriya - Jai Bhim : తమిళ స్టార్ హీరో సూర్య గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయాలు అక్కర లేదు. మురుగదాస్ దర్శకత్వంలో చేసిన ‘గజని’తో తెలుగు వారి హ‌ృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు గజని రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. గతేడాది సూర్య నటించిన మరో బ్లాక్ బస్టర్ (Soorarai Pottru) 'సూరారై పొట్రు'. ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా... పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే ఓ మైలు రాయిగా నిలిచింది. కరోనా కారణంగా ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.

అంతేకాదు 'ఆస్కార్' రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంటోంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. గత సంవత్సరం నవంబ‌ర్ 12న ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుద‌లైన ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అంతేకాదు కొన్నేళ్లుగా ఫ్లాప్‌ల‌తో డీలా ప‌డ్డ సూర్య‌కు ఈ చిత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

NTR Jr: RRR తర్వాత ఎన్టీఆర్ జోష్.. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దుమ్ము దులుపనున్న యంగ్ టైగర్..


ఇక అది అలా ఉంటే సూర్య నటించి తాజా చిత్రం ‘జై భీమ్’ (Jai Bhim). జై భీమ్.. ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో సూర్య లాయర్ చంద్రూ  పాత్రలో కనిపిస్తున్నారు. అణగారిన, పేదల కోసం పాటుపడే లాయర్ పాత్రలో సూర్య ఈ సినిమాలో అదరగొట్టారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై  అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా ఈ  సినిమాలో లాయర్ చంద్రూగా సూర్య నటన హైలెట్. మిగతా పాత్రల్లో నటించిన వాళ్లు నటించారనే కంటే ఆయా పాత్రలో లీనమై జీవించారు. అందుకే ఈ సినిమాకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

BalaKrishna - Nani : నందమూరి బాలకృష్ణకు నాని మధ్య ఉన్న ఈ అనుబంధం తెలుసా..


తాజాగా ఈ సినిమా ప్రముఖ రేటింగ్ సంస్థ IMDB (Indian Movie Data Base) లో అత్యధిక రేటింగ్ దక్కించుకున్న మూవీగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ఏకంగా IMDBలో 9.6/10 రేటింగ్ దక్కించుకుంది. 53K Likes తో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ‘జై భీమ్’ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా 9.3/10 రేటింగ్‌తో మొదటి స్థానంలో ఉన్న ‘ది షాషాంక్ రిడంప్షన్’ సినిమా రెండో స్థానానికి పడిపోయింది. ఇపుడు ఆ స్థానంలో ‘జై భీమ్’ వచ్చి చేరింది.

Balakrishna - Kodi Ramakrishna : నందమూరి బాలకృష్ణ, కోడి రామకృష్ణ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్..


ఇక మూడో స్థానంలో ‘ది గాడ్ ఫాదర్’ మూవీ 9.2/10తో మూడో స్థానంలో నిలిచింది. ‘ది డార్క్ నైట్’ మూవీ 9.0/10తో నాల్గో స్థానంలో నిలిచింది. మొత్తంగా మన భారతీయ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ రేటింగ్స్ ఉన్న సినిమాలను దాటి మొదటి స్థానంలో నిలవడం నిజంగా గర్వ కారణమని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాను తెరకెక్కించి నటించిన సూర్యతో పాటు దర్శకుడు జ్ఞానవేల్ రాజాకు నిజంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Jai Bhim Movie, Kollywood, Suriya, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు