SURIYA ET EVARIKI THALAVANCHADU TELUGU MOVIE TOTAL THEATRICAL RUN CLOSE AND BOX OFFICE COLLECTIONS TA
Suriya - ET : సూర్య ‘ET’ ఎవరికీ తలవంచడు మూవీ థియేట్రికల్ రన్ ముగింపు.. టోటల్ కలెక్షన్స్ ఎంతంటే..
సూర్య ‘ET’ థియోట్రికల్ రన్ ముగింపు ( Suriya ET Photo : Twitter)
Suriya - ET : తమిళ నటుడు సూర్య (Suriya) గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తాజాగా ఈయన నటించిన ET (ఎవరికీ తలవంచడు) మూవీ మార్చి 10న విడుదలైంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ సినిమా హిట్‌గా నిలిచిందా అంటే..
Suriya - ET : తమిళ హీరో సూర్య (Suriya) గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన సినిమా గజనితో తెలుగు వారి హృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు ‘గజని’ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. ఇటీవల సూర్య నటించిన మరో చిత్రం జై భీమ్ (Jai Bhim). జై భీమ్’ సినిమా అడివి బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇందులో సూర్య అడవి బిడ్దల తరుపున న్యాయ పోరాటం చేసే వకీల్ సాబ్ పాత్రలో కనిపించి అదరగొట్టారు. ఇక జైభీమ్ తర్వాత సూర్య నటిస్తున్న మరో సినిమా ఈటి Etharkkum Thunindhavan (ఎతర్‌క్కుమ్ తునిందవన్).ఈ సినిమా మార్చి 10న విడుదలై మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
తెలుగులో ఈ సినిమాకు ‘ఎవరికీ తలవంచడు’ అనే టైటిల‌్‌తో విడుదల చేశారు. పక్కా మాస్ అండ్ యాక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు పాండి రాజ్ తెరకెక్కించారు. ఈ సినిమా కోసం సూర్య తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో వినయ్‌రామ్, సత్యరాజ్, జయప్రకాశ్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా తెలుగు బిజినెస్ ఓ మోస్తరుగా చేసింది. తెలంగాణ (నైజాం)లో ఈ సినిమా రూ. 1.2 కోట్లు.. రాయలసీమ (సీడెడ్)లో రూ. 80 లక్షల బిజినెస్.. ఆంధ్ర ప్రదేశ్ లో రూ. 1.5 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తంగా రూ. 3.5 కోట్ల బిజినెస్ చేసింది.తాజాగా ఈ సినిమా థియేట్రికల్ బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకుంది.
ఈ సినిమా తెలంగాణ (నైజాం)లో రూ. 1.03 కోట్లు కలెక్ట్ చేసింది. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 53 లక్షలు కలెక్ట్ చేసింది. ఇంకా మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా రూ., 1.69 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 3.25 కోట్ల (రూ. 6.25 కోట్లు గ్రాస్) కలెక్ట్ చేసింది. ఓవరాల్‌గా రూ. 3.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 25 లక్షల నష్టంతో తెలుగులో 80 శాతానికి పైగా రికవరీతో బాక్సాఫీస్ దగ్గర అబౌ యావరేజ్‌గా నిలిచింది.
సూర్య విషయానికొస్తే.. ఒకపుడు వరుస హిట్స్‌తో సూర్యకు తెలుగులో మంచి మార్కెటే ఉండేది. రాను రాను ఈయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఇపుడు ఆ రేంజ్ మార్కెట్ టాలీవుడ్‌లో లేదనే చెప్పాలి. ఈయన గత సినిమాలు ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమా ఓటీటీ వేదికగా సూపర్ హిట్స్‌గా నిలిచాయి. తెలుగులో ఆయా సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా యేళ్ల తర్వాత ఈయన డైరెక్ట్‌గా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ మూవీతో పలకరించారు మొత్తంగా ఈ మూవీతో సూర్య ఓ మోస్తరు విజయాన్నే అందుకున్నారనే చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.