Home /News /movies /

SURIYA ET EVARIKI THALAVANCHADU TELUGU MOVIE BUSINESS HOW MUCH TO GET FOR BREAK EVEN THIS MOVIE TA

Suriya - ET : సూర్య ET ’ఎవరికీ తలవంచడు’ తెలుగు బిజినెస్.. బ్రేక్ ఈవెన్‌కు ఎంత రాబట్టాలంటే..

సూర్య ‘ET’ తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ (Twitter/Photo)

సూర్య ‘ET’ తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ (Twitter/Photo)

Suriya - ET :  తమిళ నటుడు సూర్య  (Suriya) గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తాజాగా ఈయన నటించిన ET (ఎవరికీ తలవంచడు) మూవీని ప్రపంచ వ్యాప్తంగా తెలుగులో ఎంత బిజినెస్ చేసిందంటే..

    Suriya - ET :  తమిళ నటుడు సూర్య  (Suriya) గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన సినిమా గజనితో తెలుగు వారి హ‌ృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు ‘గజని’ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. ఇటీవల సూర్య నటించిన మరో చిత్రం జై భీమ్ (Jai Bhim). సూర్య 40వ సినిమాగా రూపొందిన ఈ చిత్రంలో సూర్య లాయర్ పాత్రలో నటించారు. జై భీమ్’ సినిమా అడివి బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇందులో సూర్య అడవి బిడ్దల తరుపున న్యాయ పోరాటం చేసే వకీల్ సాబ్ పాత్రలో కనిపించి అదరగొట్టారు. ఇక జైభీమ్ తర్వాత సూర్య నటిస్తున్న మరో సినిమా ఈటి Etharkkum Thunindhavan (ఎతర్‌క్కుమ్‌ తునిందవన్).

    ఈ సినిమాను మార్చి 10న విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకు ‘ఎవరికీ తలవంచడు’ అనే టైటిల్ ఖరారు చేశారు.  పక్కా మాస్ అండ్ యాక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు పాండి రాజ్ తెరకెక్కించారు. ఈ సినిమా కోసం సూర్య తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు.  ఈ సినిమాలో  సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో  వినయ్‌రామ్‌, సత్యరాజ్‌, జయప్రకాశ్‌ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా తెలుగు బిజినెస్ ఓ మోస్తరుగా చేసింది. తెలంగాణ (నైజాం)లో ఈ సినిమా రూ. 1.2 కోట్లు.. రాయలసీమ (సీడెడ్)లో రూ. 80 లక్షల బిజినెస్.. ఆంధ్ర ప్రదేశ్ లో రూ. 1.5 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తంగా రూ. 3.5 కోట్ల బిజినెస్ చేసింది.

    Alia Bhatt - Samantha : ఆలియా భట్, సమంత సహా హాలీవుడ్ బాట పడుతున్న భారతీయ స్టార్స్..

    తొలి రోజు.. ఈ సినిమా తెలంగాణలో 148 స్క్రీన్స్.. రాయలసీమలో 70 స్క్రీన్స్.. ఆంధ్ర ప్రదేశ్‌లో 210 స్క్రీన్స్ కలిపి మొత్తంగా 430 థియేటర్స్‌లో విడుదల కానుంది. రెండో రోజు ‘రాధే శ్యామ్’ విడుదల నేపథ్యంలో రెండో రోజు వీటి కౌంట్ బాగానే తగ్గే అవకాశం ఉంది. ఇక  ఈ సినిమ ా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 4 కోట్ల షేర్ రాబట్టాలి. పైగా పోటీలో ‘రాధే శ్యామ్’ మూవీ కూడా ఉంది. ఈ పోటీని తట్టుకొని సూర్య సినిమా తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనేది చూడాలి.

    Radhe Shyam : ప్రభాస్ ’రాధే శ్యామ్’ సహా సినీ ఇండస్ట్రీలో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఇవే..

    సూర్య విషయానికొస్తే..  ఒకపుడు వరుస హిట్స్‌తో సూర్యకు తెలుగులో  మంచి మార్కెటే ఉండేది. రాను రాను ఈయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఇపుడు ఆ రేంజ్ మార్కెట్ టాలీవుడ్‌లో లేదనే చెప్పాలి. ఈయన గత సినిమాలు ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమా ఓటీటీ వేదికగా సూపర్ హిట్స్‌గా నిలిచాయి. తెలుగులో ఆయా సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా యేళ్ల తర్వాత ఈయన డైరెక్ట్‌గా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ మూవీతో పలకరిస్తున్నారు. ఈ మూవీతో సూర్య తాను కోరుకున్న సక్సెస్ సాధిస్తారా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: ET Movie, Kollywood, Suriya, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు