హోమ్ /వార్తలు /movies /

ET Movie Twitter Review : సూర్య ‘ET’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఇంతకీ బాక్సాఫీస్ రిపోర్ట్ ఎలా ఉందంటే..

ET Movie Twitter Review : సూర్య ‘ET’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఇంతకీ బాక్సాఫీస్ రిపోర్ట్ ఎలా ఉందంటే..

Suriya - ET Movie Twitter Reviewతమిళ నటుడు సూర్య  (Suriya) గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ఈయన నటించిన లేటెస్ట్ మూవీ ET Etharkkum Thunindhavan (ఎతర్‌క్కుమ్‌ తునిందవన్). తెలుగులో ‘ఎవరికీ తలవంచడు’ పేరుతో విడుదల చేసారు. తమిళం, తెలుగులో విడుదలైన ఈ సినిమా పబ్లిక్ టాక్ ఎలా ఉందో మన ట్విట్టర్ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...

    Suriya - ET Movie Twitter Reviewతమిళ నటుడు సూర్య  (Suriya) గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన సినిమా గజనితో తెలుగు వారి హ‌ృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు ‘గజని’ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. తాజాగా ఈయన ET (ఈటి) Etharkkum Thunindhavan (ఎతర్‌క్కుమ్‌ తునిందవన్) మూవీతో పలకరించారు. ఈ రోజే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.  తెలుగులో ఈ సినిమాకు ‘ఎవరికీ తలవంచడు’ అనే టైటిల్ ఖరారు చేశారు.  పక్కా మాస్ అండ్ యాక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు పాండి రాజ్ తెరకెక్కించారు.

    ఈ సినిమా కోసం సూర్య తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సూర్య నటించిన ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైంది. ఈయన  గత రెండు సినిమాలు ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై సంచలన విజయం సాధించాయి. తాజాగా నటించిన సినిమా థియేట్రికల్ రిలీజైవుతోంది.   ఈ సినిమాలో  సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో  వినయ్‌రామ్‌, సత్యరాజ్‌, జయప్రకాశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదల నేపథ్యంలో పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందో మన ట్విట్టర్ రివ్యూలో చూద్దాం..

    తెలుగులో కంటే తమిళంలో సూర్య అభిమానులు ఈ సినిమా చూసి ఊగిపోతున్నట్టు ట్విట్టర్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. చాలా యేళ్ల తర్వాత సూర్య నుంచి మాస్ ఓరియంటెడ్ మూవీ వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మాస్‌తో పాటు కుటుంబ కథా నేపథ్యం ఆకట్టుకునేలా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

    Top Tollywood Movies Pre Release Business : ‘బాహుబలి’ టూ ’రాధే శ్యామ్’ వరకు తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు ఇవే..

    తెలుగు బిజినెస్ ఓ మోస్తరుగా చేసింది. తెలంగాణ (నైజాం)లో ఈ సినిమా రూ. 1.2 కోట్లు.. రాయలసీమ (సీడెడ్)లో రూ. 80 లక్షల బిజినెస్.. ఆంధ్ర ప్రదేశ్ లో రూ. 1.5 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తంగా రూ. 3.5 కోట్ల బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే.. రూ. 4 కోట్ల బిజినెస్ చేసింది. సినిమా తమిళనాడు రూ. 33 కోట్ల బిజినెస్ చేసిందట. ఇక కర్ణాటకలో రూ. 2.5 కోట్ల రేంజ్ బిజినెస్‌ చేసింది. కేరళలో రూ. 1.5 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.5 కోట్ల బిజినెస్‌ను సొంతం చేసుకుందట.  భారత్‌లో రూ. 42 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ మొత్తంగా మీద రూ. 11.50 కోట్ల రేంజ్‌ బిజినెస్ సొంతం చేసుకుంది. టోటల్‌ వరల్డ్ వైడ్‌గా సినిమా రూ. 53.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ చేసింది. బ్రేక్ ఈవెన్‌కు రూ. 54 కోట్లు రాబట్టాలి. ఈ లెక్కన వరల్డ్ వైడ్‌గా రూ. 110 కోట్ల రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టాలి.

    First published:

    ఉత్తమ కథలు