Home /News /movies /

SURIYA ET ET EVARIKI THALAVANCHADU TAMIL AND TELUGU MOVIE BUSINESS HOW MUCH TO GET FOR BREAK EVEN THIS MOVIE TA

Suriya - ET : సూర్య ET ప్రపంచ వ్యాప్తంగా ఎంత బిజినెస్ చేసింది.. హిట్ అనిపించుకోవాలంటే ఎంత కలెక్ట్ చేయాలంటే..

సూర్య ‘ET’ Suriya ET Trailer Photo : Twitter

సూర్య ‘ET’ Suriya ET Trailer Photo : Twitter

Suriya - ET - Total World Wide Business :  తమిళ నటుడు సూర్య  (Suriya) గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత బిజినెస్ చేసిందంటే..

    Suriya - ET - Total World Wide Business :  తమిళ నటుడు సూర్య  (Suriya) గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన సినిమా గజనితో తెలుగు వారి హ‌ృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు ‘గజని’ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. ఇటీవల సూర్య నటించిన మరో చిత్రం జై భీమ్ (Jai Bhim). సూర్య 40వ సినిమాగా రూపొందిన ఈ చిత్రంలో సూర్య లాయర్ పాత్రలో నటించారు. జై భీమ్’ సినిమా అడివి బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇందులో సూర్య అడవి బిడ్దల తరుపున న్యాయ పోరాటం చేసే వకీల్ సాబ్ పాత్రలో కనిపించి అదరగొట్టారు. ఇక జైభీమ్ తర్వాత సూర్య నటిస్తున్న మరో సినిమా ఈటి Etharkkum Thunindhavan (ఎతర్‌క్కుమ్‌ తునిందవన్).

    ఈ సినిమాను మార్చి 10న విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకు ‘ఎవరికీ తలవంచడు’ అనే టైటిల్ ఖరారు చేశారు.  పక్కా మాస్ అండ్ యాక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు పాండి రాజ్ తెరకెక్కించారు. ఈ సినిమా కోసం సూర్య తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సూర్య నటించిన ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైంది. గత రెండు సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలైంది.   ఈ సినిమాలో  సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో  వినయ్‌రామ్‌, సత్యరాజ్‌, జయప్రకాశ్‌ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా తమిళం, తెలుగుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంత బిజినెస్ చేసిందంటే..

    Radhe Shyam Pre Release Business : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అనిపించుకోవాలంటే ఎంత రాబట్టాలి అంటే..

    తెలుగు బిజినెస్ ఓ మోస్తరుగా చేసింది. తెలంగాణ (నైజాం)లో ఈ సినిమా రూ. 1.2 కోట్లు.. రాయలసీమ (సీడెడ్)లో రూ. 80 లక్షల బిజినెస్.. ఆంధ్ర ప్రదేశ్ లో రూ. 1.5 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తంగా రూ. 3.5 కోట్ల బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే.. రూ. 4 కోట్ల బిజినెస్ చేసింది. సినిమా తమిళనాడు రూ. 33 కోట్ల బిజినెస్ చేసిందట. ఇక కర్ణాటకలో రూ. 2.5 కోట్ల రేంజ్ బిజినెస్‌ చేసింది. కేరళలో రూ. 1.5 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.5 కోట్ల బిజినెస్‌ను సొంతం చేసుకుందట.  భారత్‌లో రూ. 42 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ మొత్తంగా మీద రూ. 11.50 కోట్ల రేంజ్‌ బిజినెస్ సొంతం చేసుకుంది. టోటల్‌ వరల్డ్ వైడ్‌గా సినిమా రూ. 53.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ చేసింది. బ్రేక్ ఈవెన్‌కు రూ. 54 కోట్లు రాబట్టాలి. ఈ లెక్కన వరల్డ్ వైడ్‌గా రూ. 110 కోట్ల రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్స్‌ని చేసుకోవాలి. 

    సూర్య ‘ET’ (Twitter/Photo)


    తొలి రోజు.. ఈ సినిమా తెలంగాణలో 148 స్క్రీన్స్.. రాయలసీమలో 70 స్క్రీన్స్.. ఆంధ్ర ప్రదేశ్‌లో 210 స్క్రీన్స్ కలిపి మొత్తంగా 430 థియేటర్స్‌లో విడుదల కానుంది. రెండో రోజు ‘రాధే శ్యామ్’ విడుదల నేపథ్యంలో రెండో రోజు వీటి కౌంట్ బాగానే తగ్గే అవకాశం ఉంది. ఇక  ఈ సినిమ ా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 4 కోట్ల షేర్ రాబట్టాలి. పైగా పోటీలో ‘రాధే శ్యామ్’ మూవీ కూడా ఉంది. ఈ పోటీని తట్టుకొని సూర్య సినిమా తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనేది చూడాలి. తెలుగులో బుకింగ్స్ చాలా స్లోగా ఉన్నాయి. మొత్తంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 75 లక్షల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశాలున్నాయి.

    Top Tollywood Movies Pre Release Business : ‘బాహుబలి’ టూ ’రాధే శ్యామ్’ వరకు తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు ఇవే..


    సూర్య విషయానికొస్తే..  ఒకపుడు వరుస హిట్స్‌తో సూర్యకు తెలుగులో  మంచి మార్కెటే ఉండేది. రాను రాను ఈయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఇపుడు ఆ రేంజ్ మార్కెట్ టాలీవుడ్‌లో లేదనే చెప్పాలి. ఈయన గత సినిమాలు ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమా ఓటీటీ వేదికగా సూపర్ హిట్స్‌గా నిలిచాయి. తెలుగులో ఆయా సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా యేళ్ల తర్వాత ఈయన డైరెక్ట్‌గా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ మూవీతో పలకరిస్తున్నారు. ఈ మూవీతో సూర్య తాను కోరుకున్న సక్సెస్ సాధిస్తారా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: ET Movie, Kollywood, Suriya, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు