హీరోలు సర్ హీరోలంతే.. వాళ్లను చూడటానికి అభిమానులు నానా తంటాలు పడుతుంటారు. మరీ ముఖ్యంగా కొందరు హీరోలకు అయితే అభిమానులు కాదు ఏకంగా భక్తులు ఉంటారు. ఫ్యాన్స్ దృష్టిలో హీరోలెలా ఉంటారో తెలియదు కానీ అభిమానులంటే మాత్రం కొందరు హీరోలు నిజంగానే సొంత వాళ్లలా ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్లలో సూర్య ముందుంటాడు. ఈయనకు తన అభిమానులు అంటే ప్రాణం. వాళ్లు ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాను ఇంత దూరం వచ్చానని ఆయనకు కూడా బాగా తెలుసు. ఇదిలా ఉంటే తాజాగా అభిమాని పెళ్లికి వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆల్ ఇండియా సూర్య ఫ్యాన్ క్లబ్ సభ్యుడు హరికి పెళ్లి కుదిరిందనే విషయం తెలుసుకుని ఆయన పెళ్లికి వెళ్లాడు సూర్య. సరిగ్గా ముహూర్తం టైమ్‌కు వచ్చిన సూర్యను అంతా షాక్ అయిపోయారు.. ఓ రకమైన సంబ్రమాశ్చర్యానికి లోనయ్యారు. అభిమాన హీరో వచ్చాడనే విషయం తెలుసుకున్న అభిమాని హరి కూడా ఆనందంతో గాల్లో తేలిపోయాడు. ఆయన కాళ్లు నేలమీద నిలబడలేదంటే నమ్మలేం. సూర్యను చూసిన ఆనందంలో ఉబ్బితబ్బిబ్బైపోయాడు హరి. కాళ్లు నేలమీద నిలబడలేదు. అభిమాని పెళ్లి జరుగుతున్న విషయం మిగిలిన అభిమానుల నుంచి తెలుసుకున్న సూర్య నేరుగా అక్కడికి వెళ్లిపోయాడు. అంతేకాదు పెళ్లి కొడుక్కి స్వయంగా ఆయన చేతుల మీదుగానే తాళి బొట్టు కూడా అందించాడు సూర్య. అనంతరం వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు నిల్చొని పెళ్లి తంతును దగ్గరుండి జరిపించాడు. ఆనందంగా భోజనం కూడా చేసాడు.

అభిమాని పెళ్లికి వెళ్లిన సూర్య (Suirya fan marriage)
కొత్త జీవితం అందంగా ఉండాలని.. నిండు నూరేళ్లు హాయిగా సాగాలని మనసారా ఆశీర్వదించాడు సూర్య. ఇంత బిజీ షెడ్యూల్లోనూ అభిమాని పెళ్లి గుర్తు పెట్టుకుని మరీ వచ్చిన సూర్యను అంతా ప్రశంసలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఈయన గౌతమ్ మీనన్ 'నవరస' షార్ట్ ఫిల్మ్‌లో నటిస్తున్నాడు. 9 కథలుండే ఈ చిత్రాన్ని 9 మంది దర్శకులు డైరెక్ట్ చేస్తున్నారు. వీళ్లందరూ ఈ చిత్రానికి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేసి అక్కడ్నుంచి వచ్చిన లాభాలను పంచుకోనున్నారు. ఏదేమైనా కూడా సూర్య చేసిన పనికి మాత్రం అభిమానులు అంతా ఫిదా అయిపోయారు. ఇది మా హీరో అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:January 25, 2021, 20:05 IST