హోమ్ /వార్తలు /సినిమా /

Suriya | Bala : 18 సంవత్సరాల తర్వాత బాలా దర్శకత్వంలో సూర్య.. షూటింగ్ మొదలు..

Suriya | Bala : 18 సంవత్సరాల తర్వాత బాలా దర్శకత్వంలో సూర్య.. షూటింగ్ మొదలు..

Suriya and Bala Photo : Twitter

Suriya and Bala Photo : Twitter

Suriya | Bala : సూర్య ఈటి సినిమా హిట్ తర్వాత తాజాగా కొత్త సినిమాను మొదలు పెట్టారు. సూర్య తన తదుపరి సినిమాని స్టార్ డైరెక్ట‌ర్ బాలాతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు తమిళనాడులోని కన్యాకుమారిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సూర్య 41వ సినిమాగా వస్తోంది.

ఇంకా చదవండి ...

తమిళ నటుడు సూర్య  (Suriya) గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు.. తన సినిమా గజనితో తెలుగు వారి హ‌ృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు గజని రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. అది అలా ఉంటే ఆయన ఈటి సినిమా హిట్ తర్వాత తాజాగా కొత్త సినిమాను మొదలు పెట్టారు. సూర్య (Suriya) తన తదుపరి సినిమాని స్టార్ డైరెక్ట‌ర్ బాలాతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు తమిళనాడులోని కన్యాకుమారిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సూర్య 41వ సినిమాగా వస్తోంది. సూర్య గతంలో  (Bala) బాలా దర్శకత్వంలో శివ పుత్రుడు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాలతోపాటు సూర్యకు మంచి పేరును తెచ్చింది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తోంది. దీంతో మంచి అంచనాలున్నాయి. ఇక తాజా సినిమా విషయానికి వస్తే.. సూర్య కోసం   (Bala) బాలా మంచి కథ రాశాడని తెలుస్తోంది. అంతేకాదు సూర్య కెరీర్ లోనే ఈ చిత్రం స్పెషల్ గా ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా జ్యోతికతో పాటు ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి (Krithi Shetty) కూడా నటించనున్నారు. మరో నటి ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఈ సినిమాను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంట‌ర్‌టైన్మెంట్ నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

ఇక సూర్య ఇతర సినిమాల విషయానికి వస్తే.. సూర్య నటించిన జై భీమ్ (Jai Bhim) మంచి పేరును తెచ్చింది. సూర్య 40వ సినిమాగా రూపొందిన ఈ చిత్రంలో సూర్య లాయర్ పాత్రలో నటించారు. జై భీమ్’ సినిమా అడివి బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇందులో సూర్య అడవి బిడ్దల తరుపున న్యాయ పోరాటం చేసే వకీల్ సాబ్ పాత్రలో కనిపించి అదరగొట్టారు. ఇక జైభీమ్ తర్వాత సూర్య నటిస్తున్న మరో సినిమా ఈటి Etharkkum Thunindhavan (ఎతర్‌క్కుమ్‌ తునిందవన్). ఈ సినిమాను మార్చి 10వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమాను పక్కా మాస్ అండ్ యాక్షన్ అంశాలతో దర్శకుడు పాండి రాజ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో వినయ్‌రామ్‌, సత్యరాజ్‌, జయప్రకాశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో అనుకున్నంతగా అలరించలేదు.

ఇక జైభీమ్ కంటే ముందు సూర్య నటించిన మరో బ్లాక్ బస్టర్ (Soorarai Pottru) 'సూరారై పొట్రు'. ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా... పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే ఓ మైలు రాయిగా నిలిచింది. కరోనా కారణంగా ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు 'ఆస్కార్' రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుద‌లైన ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అంతేకాదు కొన్నేళ్లుగా ఫ్లాప్‌ల‌తో డీలా ప‌డ్డ సూర్య‌కు ఈ చిత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ చిత్రాన్ని కూడా 2డీ ఎంట‌ర్‌టైన్మెంట్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మించారు.

First published:

Tags: Krithi shetty, Suriya, Tollywood news