హోమ్ /వార్తలు /సినిమా /

Suriya : అమెజాన్ ప్రైమ్‌లో ఆకాశం నీ హద్దురా.. సూర్య అధికారిక ప్రకటన..

Suriya : అమెజాన్ ప్రైమ్‌లో ఆకాశం నీ హద్దురా.. సూర్య అధికారిక ప్రకటన..

ఇప్పటికే సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాను ఓటిటిలో విడుదల చేస్తుంటే వాళ్లు అడ్డు పడుతున్నారు. ఈ సమయంలో మాస్టర్ సినిమాను కూడా ఓటిటిలో విడుదల చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు 100 కోట్ల ఆఫర్ ఇచ్చింది ఓ ఓటిటి సంస్థ.

ఇప్పటికే సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాను ఓటిటిలో విడుదల చేస్తుంటే వాళ్లు అడ్డు పడుతున్నారు. ఈ సమయంలో మాస్టర్ సినిమాను కూడా ఓటిటిలో విడుదల చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు 100 కోట్ల ఆఫర్ ఇచ్చింది ఓ ఓటిటి సంస్థ.

Suriya : బందోబస్త్ తర్వాత సూర్య నటిస్తున్న కొత్త చిత్రం ఆకాశం నీ హద్దురా. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

  బందోబస్త్ తర్వాత సూర్య నటిస్తున్న కొత్త చిత్రం ఆకాశం నీ హద్దురా. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సూర్యతో పాటు మోహన్ బాబు కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు. మే 1న ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ, భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. సూర్య నిర్మిస్తూ నటించిన ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా కనిపిస్తోంది. గతంలో వెంకటేష్ తో గురు చిత్రాన్ని తెరకెక్కించిన మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. హిందీలో ఈ మూవీని షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.  కాగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుందని తెలుస్తోంది.  ఈ విషయాన్ని సూర్య అధికారికంగా ప్రకటించాడు.

  ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ ప్రీమియర్ గా రిలీజ్ కానుంది. వినాయక చవితి సందర్భంగా సూర్య ఈ ప్రకటన చేశాడు. అయితే ఇది మాత్రం ఊహించని సర్ప్రైజ్ అని చెప్పాలి. ఆకాశం నీ హద్దురా చిత్రం వచ్చే అక్టోబర్ 30 వ తారీఖున స్ట్రీమింగ్ కానుంది. అయితే కేవలం తమిళ వర్షన్ మాత్రమే స్ట్రీమ్ కానుందా.. లేదా రెండు తమిళ తెలుగు భాషాల్లో స్ట్రీమ్ కానుందా అనేది తెలియాల్సీ వుంది.  ఇక ఈ మధ్యే సూర్య బర్త్ డే కానుకగా వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివసల్ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Suriya

  ఉత్తమ కథలు