హోమ్ /వార్తలు /సినిమా /

Suriya : సూర్య మరో సంచలనం.. ఓటీటీలో విడుదలకానున్న ఆకాశం నీ హద్దురా...

Suriya : సూర్య మరో సంచలనం.. ఓటీటీలో విడుదలకానున్న ఆకాశం నీ హద్దురా...

సూర్య Photo : Twitter

సూర్య Photo : Twitter

Suriya : తమిళనాట సంచలనాలకు మారుపేరుగా మారాడు సూర్య.

  తమిళనాట సంచలనాలకు మారుపేరుగా మారాడు సూర్య. లాక్ డౌన్ తర్వాత థియేటర్లు మూత పడటంతో సూర్య నిర్మాణంలో జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన పొన్ మగల్ వందాల్ అనే సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఈదశలో తన సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు సూర్య. కోలీవుడ్ స్టార్ హీరో తీసుకున్న ఈ నిర్ణయం పై తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. భవిష్యత్ లో సూర్య నటించే కొత్త చిత్రాలను థియేటర్లలో విడుదల కానివ్వం అంటూ హెచ్చరికలు పంపాయి. కానీ సూర్య ఈ వివాదాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పైగ తనకు 70 కోట్లకు పైగా అప్పు ఉందనీ, కరోనా పరిస్థితుల్లో ఇంతకంటే ఏం చేయలేం అంటూ పొన్ మగాల్ వందాల్ ను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసాడు. ఇఫ్పుడు తాను నటించిన కొత్త సినిమా ఆకాశం నీ హద్దురా మూవీని కూడా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నాడు అంటోంది కోలీవుడ్. ఈ సినిమాను ఆగమేఘాల మీద సెన్సార్ కు పంపడం, యూ సర్టిఫికెట్ కోసం సూర్య ప్రయత్నాలు చేయడం చూస్తుంటే ఈ సినిమా కూడా త్వరలో ఓటీటీ మాధ్యమం ద్వారానే నెటిజన్ల ముందుకు రానుందా అనే సందేహం కలుగుతోంది. అంతే కాకుండా ఈ మధ్యే సూర్య బర్త్ డే కానుకగా వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివసల్ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఒకసారి ఆకాశం నీ హద్దుగా బ్యాగేజ్ దించేసుకుంటే నెక్ట్స్ సినిమాపై దృష్టి పెట్టవచ్చని సూర్య భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. బందోబస్త్ తర్వాత సూర్య నటిస్తున్న కొత్త చిత్రం ఆకాశం నీ హద్దురా.

  ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సూర్యతో పాటు మోహన్ బాబు కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు. మే 1న ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ, భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. సూర్య నిర్మిస్తూ నటించిన ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా కనిపిస్తోంది. గతంలో వెంకటేష్ తో గురు చిత్రాన్ని తెరకెక్కించిన మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. హిందీలో ఈ మూవీని షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఓటీటీకి వెళితే ఆ డీల్ ఏ స్థాయిలో ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆకాశం నీ హద్దురా కనుక డిజిటల్ స్ట్రీమింగ్ లో రిలీజ్ అయితే మాత్రం సౌత్ సైడ్ ఓటీటీకి పెద్ద బూస్ట్ లభించినట్లే లెక్క.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Suriya

  ఉత్తమ కథలు