SURIYA 25TH MOVIE BLOCKBUSTER YAMUDU COMPLETED 11 YEARS AND HERE THE COLLECTIONS PK
Yamudu movie @ 11 Years: సూర్య ‘యముడు’ సినిమాకు 11 ఏళ్ళు పూర్తి.. బాక్సాఫీస్ లెక్కలు ఇవే..
సూర్య యముడు సినిమాకు 11 ఏళ్ళు పూర్తి (Suriya Yamudu)
Yamudu movie @ 11 Years: గజిని(Ghajini) సినిమాతో తెలుగులో సంచలన వియజం సాధించిన తర్వాత సూర్యకు(Suriya) తెలుగులో మంచి మార్కెట్ వచ్చింది. కానీ ఆ తర్వాత కొన్నేళ్ళ పాటు ఈయనకు తెలుగులో చెప్పుకోదగ్గ విజయం లేదు. అలాంటి సమయంలో హరి దర్శకత్వంలో వచ్చిన సినిమా యముడు(Yamudu).
గజిని సినిమాతో తెలుగులో సంచలన వియజం సాధించిన తర్వాత సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ వచ్చింది. గజిని 10 కోట్లకు పైగా వసూలు చేసి సూర్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వచ్చేసింది. దాంతో అప్పట్నుంచే తన సినిమాలను వరసగా తెలుగులోనూ విడుదల చేయడం మొదలు పెట్టారు. గజిని కంటే ముందుగానే శివ పుత్రుడు సినిమాతో పేరు తెచ్చుకున్నాడు సూర్య. కానీ ఆ తర్వాత కొన్నేళ్ళ పాటు ఈయనకు తెలుగులో చెప్పుకోదగ్గ విజయం లేదు. మధ్యలో వచ్చిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, వీడోక్కడే సినిమాలకు మంచి టాక్ వచ్చినా కమర్షియల్ సక్సెస్ కాలేదు. అలాంటి సమయంలో హరి దర్శకత్వంలో వచ్చిన పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ యముడు. పైగా ఇది సూర్యకు 25వ సినిమా కూడా. మంచి అంచనాలతో వచ్చిన యముడు తెలుగులోనూ అద్భుతం చేసింది. 2010, జూలై 2న విడుదలైన ఈ చిత్రం 10 కోట్లకు పైగానే షేర్ వసూలు చేసింది.
సూర్య యముడు సినిమాకు 11 ఏళ్ళు పూర్తి (Suriya Yamudu)
సూర్య యముడు సినిమాకు 11 ఏళ్ళు పూర్తి (Suriya Yamudu)
సింగం తమిళనాట 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సూర్య రేంజ్ మరింత పెంచేసింది. తెలుగులో యముడుగా వచ్చి ఇక్కడా సంచలన విజయం సాధించింది. తెలుగులో 5 కోట్లకు పైగానే బిజినెస్ చేసిన యముడు.. 11 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. అనుష్క అందాలు.. ప్రకాశ్ రాజ్ విలనిజం ఈ చిత్రానికి ప్రధానాకర్షణ.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.