Surgical Strikes 2.O.. భారతీయ వాయుసేనను పొగడ్తలతో ముంచెత్తిన టాలీవుడ్ సెలెబ్రిటీలు..

Surgical strikes 2.O | ఈ నెల 14న సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 40 మంది జవాన్లను పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌కు చెందిన ముష్కరులు పుల్వామా దగ్గర దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే కదా.  ఈ దాడిపై టాలీవుడ్‌కు చెందిన పలువరు సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల ద్వారా భారత వాయుసేనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 26, 2019, 2:03 PM IST
Surgical Strikes 2.O.. భారతీయ వాయుసేనను పొగడ్తలతో ముంచెత్తిన టాలీవుడ్ సెలెబ్రిటీలు..
టాలీవుడ్ సెలెబ్రిటీలు
  • Share this:
ఈ నెల 14న సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 40 మంది జవాన్లను పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌కు చెందిన ముష్కరులు పుల్వామా దగ్గర దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే కదా.  ఈ దాడిలో అసువులు బాసిన సైనికుల కోసం కాశ్మీర్ టూ కన్యాకుమారి వరకు దేశ వ్యాప్తంగా ప్రజలందరు సంఘీభావం ప్రకటించారు. అంతేకాదు 40 మంది వీర జవాన్ల మరణానికి ధీటైన సమాధానం కోసం భారత దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. తాజాగా వీర జవానుల వీర మరణంపై భారత వాయుసేన ప్రతీకారం తీర్చుకుంది.

ఈ రోజు తెల్లవారుఝామున ఎల్వీసి వెంట ఉన్న ఉగ్ర స్థావరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. అంతేకాదు భారత వైమానిక దాడులతో పాకిస్థాన్ బెంబెలెత్తిపోతుంది. ఈ దాడిపై టాలీవుడ్‌కు చెందిన పలువరు సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల ద్వారా భారత వాయుసేనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా ఎయిర్ ఫోర్స్ జరిపిన యుధ్దం భారత దేశ ప్రజలు గర్వపడేలా చేసిందన్నారు. ఇండియా స్ట్రైక్ బ్యాక్ అంటూ చెర్రీ ట్వీట్ చేశాడు. మరోవైపు ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా  ఇండియా స్ట్రైక్ బ్యాక్ అంటూ భారత వాయుసేనకు వందనం అర్పించాడు.

మరోవైపు టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, రాం చరణ్, నితిన్, వరుణ్ తేజ్, శ్రీకాంత్,సోను సూద్, సంపూర్ణేష్ బాబు, అల్లు శిరీష్ సహా  హీరోయిన్ సమంత, రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా భారత వాయుసేన జరిపిన మెరుపుదాడులపై శుభాకాంక్షలు తెలియజేసారు.












Published by: Kiran Kumar Thanjavur
First published: February 26, 2019, 12:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading