• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • SURESH PRODUCTIONS TAKEN THE REMAKE RIGHTS OF KOREAN MOVIE LUCK KEY WITH NAGA CHAITANYA PK

Naga Chaitanya Suresh Babu: సురేష్ ప్రొడక్షన్స్ కొరియన్ రీమేక్.. మేనల్లుడు చైతూకు సురేష్ బాబు గిఫ్ట్..?

లక్కీ కీ కొరియన్ రీమేక్ (Luck Key movie)

Naga Chaitanya Suresh Babu: టాలీవుడ్‌లో రీమేక్ సినిమాలు ఇప్పుడు చాలా వస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో 80 శాతం రీమేకులే ఉన్నాయిప్పుడు. తాజాగా లూసీఫర్ రీమేక్ కూడా మొదలు పెట్టాడు మెగాస్టార్.

  • Share this:
టాలీవుడ్‌లో రీమేక్ సినిమాలు ఇప్పుడు చాలా వస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో 80 శాతం రీమేకులే ఉన్నాయిప్పుడు. తాజాగా లూసీఫర్ రీమేక్ కూడా మొదలు పెట్టాడు మెగాస్టార్. మరోవైపు పవన్ కూడా వరస సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మరో రీమేక్ సినిమా కూడా తెలుగు ఇండస్ట్రీకి రాబోతుంది. ఈ మధ్య కొరియన్ సినిమాలను కూడా టాలీవుడ్ వరకు తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. అప్పట్లో విడుదలైన ఓ బేబీ కూడా అక్కడ్నుంచి వచ్చిన కథే. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది. ఇప్పుడు మరో కొరియన్ సినిమాను కూడా తెలుగు ఇండస్ట్రీకి తీసుకొస్తుంది సురేష్ ప్రొడక్షన్స్. లక్కీ కీ అనే సినిమాను తెలుగుతో పాటు ఇండియన్ భాషల్లో రీమేక్ చేయడానికి రైట్స్ సొంతం చేసుకున్నారు సురేష్ నిర్మాణ సంస్థ. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. కామెడీ క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన లక్కీ కీ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. జపనీస్‌లో వచ్చిన కీ ఆఫ్ లైఫ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను తెలుగులో ఓ ప్రముఖ నటుడు, దర్శకుడి కాంబినేషన్‌లో రీమేక్ చేయనున్నట్లు ప్రకటించారు. ఆ ప్రముఖ నటుడు ఎవరనేది చెప్పలేదు. కానీ ప్రస్తుతం టాలీవుడ్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం చూస్తుంటే నాగ చైతన్య పేరు తెరపైకి వచ్చింది. ఇందులో చైతూ హీరోగా నటించబోతున్నాడని.. ఓ కుర్ర దర్శకుడు సినిమా బాధ్యతలు తీసుకుంటున్నాడని వార్తలొస్తున్నాయి. లక్కీ కీ రీమేక్‌పై త్వరలోనే పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published: