హోమ్ /వార్తలు /సినిమా /

Suresh Kondeti: సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022.. గ్రాండ్ ఈవెంట్ ఎప్పుడంటే..!

Suresh Kondeti: సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022.. గ్రాండ్ ఈవెంట్ ఎప్పుడంటే..!

Santhosham awards (Photo twitter)

Santhosham awards (Photo twitter)

Santhosham Awards 2022: సినిమా ఇండస్ట్రీలో అవార్డ్స్ ఫంక్షన్ అనేది ఎప్పుడూ ప్రత్యేకమే. అతిరథమహారాదులంతా ఒక్కచోట చేరే ఈ వేడుకలు ప్రేక్షకులకు కన్నుల పండగ అవుతుంటాయి. ఇలాంటి వెనుకలన్నింటిలో కూడా “సంతోషం అవార్డ్స్” కి మాత్రం ఓ సుస్థిర స్థానం ఉందని చెప్పక తప్పదు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సినిమా ఇండస్ట్రీలో అవార్డ్స్ ఫంక్షన్ అనేది ఎప్పుడూ ప్రత్యేకమే. అతిరథమహారాదులంతా ఒక్కచోట చేరే ఈ వేడుకలు ప్రేక్షకులకు కన్నుల పండగ అవుతుంటాయి. ఇలాంటి వెనుకలన్నింటిలో కూడా “సంతోషం అవార్డ్స్” కి మాత్రం ఓ సుస్థిర స్థానం ఉందని చెప్పక తప్పదు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ అవార్డులు కార్యక్రమం ఘనంగా చేయడం జరుగుతూ వస్తోంది. అలాగే ఈసారి కూడా అదే విధంగా సంతోషం పత్రిక అధినేత, నిర్మాత సురేష్ కొండేటి ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు.

తెలుగు సినిమా పరిశ్రమలో సురేష్‌ కొండేటి అంటే తలలో నాలుకలా ఉంటాడన్న పేరు ఉంది. సాధారణ స్థాయి నుండి ఓ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, సంతోషం పత్రిక అధినేత, నటుడు ఇలా పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి. అసలు అవార్డ‌లు కార్య‌క్ర‌మం ప్రారంభించ‌డానికి కార‌ణం హీరో నాగార్జున అని సురేష్ చెబుతూ ఉంటారు. సంతోషం మ్యాగ‌జైన్ ఓపెనింగ్ రోజ అవార్డులు కూడా ప్ర‌ధానం చేస్తే బాగుంటుంద‌ని ఆయ‌న స‌ల‌హా ఇవ్వ‌డంతో ఇదంతా చేయ‌గ‌లిగానని ఆయన పలు సంధర్భాల్లో పేర్కొన్నారు. త‌ర్వాత‌ చిరంజీవి గారు, బాల‌కృష్ణ గారు, వెంక‌టేష్ గారు న‌న్ను ఎంత‌గానో ప్రోత్స‌హించారని అంటూ ఉంటారు.

ఇక అలా తెలుగు సినిమాలకు గత 20 ఏళ్లుగా అవార్డులు అందిస్తున్న ‘సంతోషం’ వారపత్రిక ఆధ్వర్యంలో 21వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022 వేడుకలు డిసెంబర్ నెల 26న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సంతోషం అధినేత సురేష్ కొండేటి ఈ ఏడాది జరగబోయే ఫంక్షన్ కు సంబంధించి డేట్ ప్రకటించారు. డిసెంబర్ 26న హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి.

సౌత్ ఇండియా లోని నాలుగు భాషల సినిమాలకు అవార్డులు అందిస్తూ వస్తున్నారు. డిసెంబర్ 26న జరగబోయే ఈ అవార్డు వేడుకల్లో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ బాషల సినిమాలకు అవార్డులు అందచేయనున్నారు. ఇక ఈ కార్యక్రమం మూడున్నర గంటలకు ప్రారంభమై పన్నెండు గంటల పాటు సాగనుంది, 12 గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించనున్నారు.

సంతోషం అధినేత సురేష్ కొండేటి ఈ అవార్డు వేడుకలను ప్రతి ఏడాది ఓ యజ్ఞంలా జరుపుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా సమయంలో గత ఏడాది కూడా ఘనంగా ఈ అవార్డు జరిగింది. ఈసారి అంతర్జాతీయ స్థాయిలో గ్రాండ్ గా జరగనున్న ఈ వేడుకల్లో పలువురు తారల డ్యాన్స్, కామెడీ, హంగామాతో ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతోందని సురేష్ వెల్లడించారు.

First published:

Tags: Cinema, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు