హోమ్ /వార్తలు /సినిమా /

Nithiin | Surender Reddy : సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్... మరి పవన్ కళ్యాన్ సినిమా పరిస్థితి..

Nithiin | Surender Reddy : సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్... మరి పవన్ కళ్యాన్ సినిమా పరిస్థితి..

Nithiin and Surender Reddy Photo : Twitter

Nithiin and Surender Reddy Photo : Twitter

Nithiin | Surender Reddy : సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ ఓ సినిమాను చేయనున్నారని తెలుస్తోంది.

యువ నటుడు నితిన్.. (Nithiin) ప్రస్తుతం మాస్ట్రో  (Maestro)అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీలో మంచి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌‌గా వస్తోంది. మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక అది అలా ఉంటే నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమాను ఖరారు చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాతో పాటు ఆయన మరో సినిమాను కూడా ఓకే అన్నట్లు సమాచారం. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో ఓ సినిమాను నితిన్ చేయనున్నాడని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి విషయానికి వస్తే.. తెలుగు ఇండస్ట్రీలో ఆయనది ఓ ప్రత్యేక స్థానం.. హీరోలను స్టైలీష్‌గా చూపించడంలో ఆయన సిద్ధహస్తుడు. చూడాలి మరి నితిన్‌ను ఎలా చూపించబోతున్నారో.. ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి (Akhil Akkineni) అఖిల్ అక్కినేనితో ఒక స్పై థ్రిల్లర్‌ను చేస్తున్నారు. ఏజెంట్ పేరుతో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమా తర్వాత బహుశా నితిన్ సినిమా ఉండోచ్చు. ఈ రెండు సినిమాల తర్వాత సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమాను చేయనున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది. ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌కు చాలా సమయం ఉండడంతో మధ్యలో ఇలా నితిన్ సినిమాను తెరకెక్కించనున్నాడు సురేందర్ రెడ్డి.

ఇక నితిన్ మాస్ట్రో విషయానికి వస్తే.. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీల్లో విడుదలకానుంది. ఈ సినిమా సెప్టెంబర్ 17న హాట్ స్టార్ స్ట్రీమ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. నితిన్ సొంత నిర్మాణ సంస్థ 'శ్రేష్ఠ్ మూవీస్' నిర్మించిన ఈ చిత్రానికి రూ.32 కోట్ల మొత్తానికి డీల్ అయినట్లు తెలుస్తోంది. నితిన్ ఈ సినిమాలో అంధుడిగా కనిపించనున్నారు.

నితిన్ సరసన నభా నటేష్ నటించింది. ఇక ఒరిజినల్‌లో టబు చేసిన పాత్రలో తమన్నా నటించింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ మాస్ట్రోకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుంది.

ఇక నితిన్ ఇటీవల నటించిన ఇతర సినిమాల విషయానికి వస్తే.. రంగ్ దే అనే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో వచ్చారు. ఈ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటించింది.

ఈ సినిమా మార్చి 26 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టకోలేకపోయింది. ఇక ఇటీవల నితిన్ హీరోగా వచ్చిన మరో సినిమా చెక్. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చంద్రశేఖర్ ఏలేటీ దర్శకత్వం వహించారు.

First published:

Tags: Nithiin, Surender reddy, Tollywood news

ఉత్తమ కథలు