సురేందర్ రెడ్డి.. కింగ్ ఆఫ్ మేకింగ్..

అతనొక్కడే నుంచి అశోక్.. అతిథి.. కిక్.. ఊసరవెల్లి.. రేసుగుర్రం.. కిక్ 2.. ధృవ ఇలా ఏ సినిమా తీసుకున్నా కూడా సురేందర్ రెడ్డి మేకింగ్ హైలైట్ అవుతుంది. ఆ సినిమాల్లో కొన్ని ఫ్లాపులు ఉండొచ్చు కానీ దర్శకుడిగా మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు సురేందర్ రెడ్డి.

news18-telugu
Updated: August 21, 2018, 7:29 PM IST
సురేందర్ రెడ్డి.. కింగ్ ఆఫ్ మేకింగ్..
రామ్‌చరణ్, సురేందర్ (ఫైల్ ఫొటోస్)
  • Share this:
ఫ్లాపులు వస్తే ఆ దర్శకుడి వైపు చూడ్డానికి కూడా ఇష్టపడరు మన హీరోలు. కానీ ఒక్క దర్శకుడు మాత్రం హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా 12 ఏళ్లుగా స్టార్ హీరోలతో పని చేస్తూనే ఉన్నాడు. ఒక్కో సినిమాతో తన సత్తా చూపిస్తూనే పోతున్నాడు. ఫలితంతో అసవరం లేదు.. ఆయన మేకింగ్‌కు పడిపోతున్నారు హీరోలు. అందుకే పిలిచి మరీ ఆఫర్ ఇస్తారు. ఆ దర్శకుడు సురేందర్ రెడ్డి. అతనొక్కడే సినిమాతో 2005లో ఇండస్ట్రీకి వచ్చిన ఈ దర్శకుడు.. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటిగా ఉన్న సైరా నరసింహారెడ్డిని తెరకెక్కిస్తున్నాడు.

SURENDER REDDY.. KING OF MAKING SYERAA
SURENDER REDDY.. KING OF MAKING SYERAA


ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా.. అవన్నీ ఒకెత్తైతే ఇప్పుడు తాను తెరకెక్కిస్తున్న సైరా మరో ఎత్తు అంటున్నాడు ఈ దర్శకుడు. తాజాగా సైరా టీజర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సురేందర్ రెడ్డి మేకింగ్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. అసలు ఈయనలో ఇంతటి గొప్ప విజన్ ఉందా అంటూ నోరెళ్లబెట్టి చూస్తున్నారు. బేసిక్‌గానే సురేందర్ రెడ్డికి కింగ్ ఆఫ్ మేకింగ్ అనే పేరుంది.ఇప్పుడు సైరాతో మరోసారి అది నిరూపించుకునే పనిలో ఉన్నాడు ఈ దర్శకుడు.

అతనొక్కడే నుంచి అశోక్.. అతిథి.. కిక్.. ఊసరవెల్లి.. రేసుగుర్రం.. కిక్ 2.. ధృవ ఇలా ఏ సినిమా తీసుకున్నా కూడా సురేందర్ రెడ్డి మేకింగ్ హైలైట్ అవుతుంది. ఆ సినిమాల్లో కొన్ని ఫ్లాపులు ఉండొచ్చు కానీ దర్శకుడిగా మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు సురేందర్ రెడ్డి. అందుకే ఆ నమ్మకంతోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ తీసుకెళ్లి చిరంజీవి ఈ దర్శకుడి చేతుల్లో పెట్టాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సురేందర్ రెడ్డి స్టామినా ఏంటో..? ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత చిరు నమ్మకం నిజమే అని అర్థమవుతుంది. బాలీవుడ్ సినిమాలు కూడా ముక్కున వేలేసుకునేలా విజువల్ ట్రీట్ ఇచ్చాడు సురేందర్ రెడ్డి.ముఖ్యంగా కెమెరామెన్ రత్నవేలు కూడా తన పనితనం చూపించాడు. ఇక వీళ్లందరికీ చిరంజీవి ఇచ్చిన ప్రోత్సాహం మరింత ఉత్సాహాన్నిస్తుంది. సైరా టీజర్‌తోనే సినిమా ఎలా ఉండబోతుందో ఓ క్లారిటీ వచ్చేసింది. పూర్తి సినిమా ఇంతకంటే అద్బుతంగా ఉంటుందని హామీ ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. మరీ ముఖ్యంగా రామ్‌చరణ్ అయితే తండ్రి కల నెరవేర్చడమే లక్ష్యం అంటున్నాడు. మొత్తానికి అటు సురేందర్ రెడ్డి.. ఇటు రామ్‌చరణ్ కలిసి సైరాను మహాద్భుతంలా ఆవిష్కరిస్తున్నారు.

https://youtu.be/NMRJTTMMmZw
Published by: Kiran Kumar Thanjavur
First published: August 21, 2018, 5:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading