టాలీవుడ్లో స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న వారిలో సురేందర్ రెడ్డి ఒకరు. ప్రస్తుతం ఈ స్టైలిష్ డైరెక్టర్ అఖిల్ అక్కినేనితో సినిమా చేయడానికి రెఢీ అవుతున్నారు. ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. కాగా ఇదే నిర్మాతకు పవన్‌కల్యాణ్‌తో మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధం కారణంగా పవన్‌కల్యాణ్‌తోనూ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు కూడా సురేందర్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఒక పక్క అఖిల్‌తో సినిమా చేస్తూనే పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయడానికి సురేందర్ రెడ్డి ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటాడట. కమర్షియల్ ఎంటర్టైనర్ను తెరకెక్కించడంలో దిట్ట అయిన సురేందర్ రెడ్డి పవన్‌తో ఓ డిఫరెంట్ సినిమా చేయబోతున్నాడట.
ప్రస్తుతం పవన్‌కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఆయన ఇమేజ్‌కు సరిపోయేలా అభిమానులను ఆకట్టుకునేలా ఓ పొలిటికల్ సబ్జెక్ట్ తయారు చేస్తున్నాడట. అయితే పొలిటికల్ సబ్జెక్ట్ సీరియస్‌గా కాకుండా కాస్త ఎంటర్టైనింగ్ వేలో ఉంటుందని సమాచారం. అంతే కాకుండా పవన్ క్యారెక్టర్‌ను నెగటివ్ షేడ్‌లో చూపిస్తూ వచ్చి పాజిటివ్ యాంగిల్‌కు మార్చేలా కాన్సెప్ట్‌ను సురేందర్ రెడ్డి తయారు చేస్తున్నాడని అంటున్నారు. ఈ పాయింట్ వింటుంటే సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఓ సినిమాలోని హీరో పాత్రను ఆధారంగా చేసుకునే పవన్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఆ సినిమా ఏదో కాదు. ఊసరవెళ్లి. ఇందులో ఎన్టీఆర్ పాత్ర నెగటివ్ షేడ్తోనే స్టార్ట్ అవుతుంది. చివరకు అది పాజిటివ్ యాంగిల్లో మారతుంది. అలాంటి ఎన్టీఆర్ పాత్రనే బేస్ చేసుకుని సురేందర్ రెడ్డి పవన్ పాత్రను పొలిటిక్ యాంగిల్లో డిజైన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.
గత ఏడాది మెగాస్టార్ చిరంజీవితో ప్యాన్ ఇండియా మూవీ సైరా నరసింహారెడ్డిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. తెలుగు మినహా మరో భాషలో సినిమా సక్సెస్ కాలేదు. సినిమాను నిర్మించిన రామ్‌చరణ్‌కు నష్టాలను తెచ్చిన ప్రాజెక్ట్‌గా సైరా నరసింహారెడ్డి మిగిలింది. కాస్త గ్యాప్ వచ్చినా ఇప్పుడు సురేందర్ రెడ్డి అఖిల్, పవన్ కల్యాణ్‌లతో వరుస ప్రాజెక్టులను చేస్తున్నాడు.