టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో కెల్లా సురేఖా వాణి (Surekha Vani) క్రేజ్ వేరు. అందానికి తోడు తనదైన నటనతో ఆడియన్స్ ఫాలోయింగ్ పెంచుకుంది సురేఖా. తల్లి, అక్క, వదిన పాత్రల్లో నటించి ఎన్నో సినిమాల విజయాల్లో భాగమైన ఈ నటి.. తాజాగా తన ఇంట్లో ఓ పార్టీ చేసుకుంది. తన తోటి నటీమణులతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేసేసింది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉండే సురేఖా వాణి తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేసి స్పెషల్ గా అట్రాక్ట్ చేసింది.
సీనియర్ నటులు హేమ, సన, బిగ్‌బాస్ ప్రియ, రజిత.. ఇలా మొత్తం 12 మంది సీనియర్ నటీమణులు సురేఖ వాణి ఇంట్లో గాథర్ అయ్యారు. అంతా కలిసి గెట్ టు గెదర్ పార్టీ చేసుకున్నారు. సరదాగా ఫోటోలు దిగారు. ఈ ఆనంద సమయంలో అంతా కలిసి హుషారుగా డ్యాన్స్‌లు కూడా చేశారు. ఈ అదిరిపోయే స్టెప్పులను సురేఖా వాణి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
కిచ్చా సుదీప్ నటించిన విక్రాంత్ రోణ సినిమాలోని ‘రా రా రక్కమ్మ’ సాంగ్ కు డాన్స్ చేస్తూ అందరూ ఎంజాయ్ చేశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ ఆలోచనలకు పదును పెడుతూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ఆంటీలంతా ఒకే చోట జమయ్యారా? బాగానే ప్లాన్ చేశారుగా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
View this post on Instagram
సురేఖా వాణితో కలిసి సుప్రిత చేసే ఎంజాయ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఇద్దరూ కూడా తెగ షికార్లు కొడుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటారు. పార్టీలు, పబ్స్ అంటూ తెగ రచ్చ చేస్తుంటారు. అలా ఈ ఇద్దరికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సందర్భాలు బోలెడు. ఇదే క్రమంలో తాజాగా తన తోటి నటులతో స్టెప్పేసి ఆకట్టుకుంది సురేఖా వాణి. తన భర్త మరణం తర్వాత సినిమాల పరంగా వెండితెరకు దూరంగా ఉంటున్న సురేఖా.. ప్రస్తుతం తన కూతురు సుప్రిత సినీ కెరీర్ పై శ్రద్ద పెడుతోందని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Surekha Vani, Tollywood, Tollywood actress