హోమ్ /వార్తలు /సినిమా /

నా లవర్ వదిలేసిందన్నా.. ఫ్యాన్‌కు సాయి ధరమ్ తేజ్ సూపర్ రిప్లై..

నా లవర్ వదిలేసిందన్నా.. ఫ్యాన్‌కు సాయి ధరమ్ తేజ్ సూపర్ రిప్లై..

సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej Solo Bratuke So Better movie)

సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej Solo Bratuke So Better movie)

Sai Dharam Tej: లాక్‌డౌన్ కారణంగా మన హీరోలకు చాలా టైమ్ దొరికింది. అందులో కాస్త సమయాన్ని అభిమానుల కోసం కూడా కేటాయిస్తున్నారు. ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్..

లాక్‌డౌన్ కారణంగా మన హీరోలకు చాలా టైమ్ దొరికింది. అందులో కాస్త సమయాన్ని అభిమానుల కోసం కూడా కేటాయిస్తున్నారు. ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన ప్రస్తుతం అభిమానులతో లైవ్ ఛాట్ చేస్తున్నాడు. ట్విట్టర్‌లో వాళ్లు అడిగే ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇస్తున్నాడు. రొటీన్ ప్రశ్నలు కాకుండా కాస్త కొత్తగా ఉన్న ప్రశ్నలు ఎంచుకుని వాటికి మాత్రమే జవాబు ఇస్తున్నాడు సాయి. అందులో ఓ అభిమాని చాలా విచిత్రమైన ప్రశ్న అడిగాడు.


అన్నా.. నా లవర్ నన్ను వదిలేసి వేరేవాన్ని పెళ్లి చేసుకుంటుంది.. ఏం చేయమంటావ్.. ఓ సింగిల్ గాడు అడుగుతున్నాడు చెప్పన్నా అంటూ అడిగేసాడు. దీనికి సాయి ధరమ్ తేజ్ కూడా అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. శంకర్ దాదా ఎంబిబిఎస్‌లో మన బాస్ ఏం చెప్పాడో తెలుసు కదా అంటూ చైలా చైలా పాటను హైలైట్ చేసాడు సాయి ధరమ్ తేజ్. మరో అభిమాని చిరు, పవన్ ఫోటోలను చూపించి కామెంట్ ప్లీజ్ అంటే నా రెండు కళ్లు అని సమాధానమిచ్చాడు సాయి.


అవే కాదు ఇంకా చాలా ప్రశ్నలకు మంచి ఆన్సర్స్ ఇస్తున్నాడు ఈయన. మహేష్ బాబుతో తనకు నటించాలని ఉందని చెప్పాడు. ఆయన సినిమాలో చిన్న పాత్రైనా చేస్తానంటున్నాడు సాయి ధరమ్ తేజ్. అల్లు అర్జున్ నుంచి చాలా నేర్చుకోవాలని.. కొత్తదనం కోసం ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాడని ప్రశంసించాడు. మధ్యలో మారుతి, హరీష్ శంకర్ లాంటి దర్శకులు కూడా వచ్చి సాయిని ప్రశ్నలు అడిగారు. దాదాపు గంట సేపు అభిమానులతో ఛాట్ చేసాడు సాయి.

First published:

Tags: Sai Dharam Tej, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు