Sai Dharam Tej: నో పెళ్లి దాన్‌తల్లి అంటున్న సాయి ధరమ్ తేజ్.. అందరికీ క్లారిటీ వచ్చినట్లేగా..

సాయి ధరమ్ తేజ్ పెళ్లి (sai dharam tej)

Sai Dharam Tej marriage: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకడు. ఈ మెగా మేనల్లుడి వయసు కూడా 30 దాటి మూడేళ్లైపోయింది. దాంతో పెళ్లెప్పుడు అంటూ ప్రశ్నలు కూడా వస్తూనే ఉన్నాయి.

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకడు. ఈ మెగా మేనల్లుడి వయసు కూడా 30 దాటి మూడేళ్లైపోయింది. దాంతో పెళ్లెప్పుడు అంటూ ప్రశ్నలు కూడా వస్తూనే ఉన్నాయి. ఇదిగో ఇప్పుడే అంటూ ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి కూడా. ఇదిలా ఉంటే ఆ మధ్య తన బ్రహ్మచర్యానికి చరమగీతం పాడుతున్నట్లు ట్వీట్ కూడా చేసాడు ఈయన. అయితే అదంతా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే మిగిలిపోయింది. ప్రస్తుతం ఈయన సోలో బ్రతుకే సో బెటరూ సినిమాలో నటిస్తున్నాడు. బయట కూడా ఇదే బాగుందంటున్నాడు సాయి. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యం లేదంటున్నాడు సాయి. తన కంటే.. తన కుటుంబం కంటే మీడియాకే తన పెళ్లిపై ఎక్కువ ఆసక్తి ఉందంటూ సెటైర్లు కూడా వేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. అందుకే ప్రతీసారి తన పెళ్లిపై టాపిక్స్ వస్తుంటాయని చెప్పాడు ఈయన. అయితే ఈ వార్త‌ల‌పై స్పందించిన సాయి ధ‌ర‌మ్ పెళ్లిపై ఓ క్లారిటీ ఇచ్చేసాడు.
అమ్మతో సాయి ధరమ్ తేజ్(sai dharam tej mother)
అమ్మతో సాయి ధరమ్ తేజ్(sai dharam tej mother)

ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తామంటే చూసుకోండ‌ని చెప్పినట్లు కన్ఫర్మ్ చేసాడు. అంతే కానీ మీడియాలో వస్తున్నట్లు పెళ్లికి అయితే సిద్ధంగా లేనని చెప్పాడు. ప్ర‌స్తుతానికి పెళ్లంటే ఇంట్రెస్ట్ లేదని.. ఒక‌వేళ అమ్మాయి బాగుంద‌ని ఇంట్లోవాళ్లు ఒత్తిడి చేస్తే అప్పుడు ఆలోచిస్తానంటున్నాడు సాయి. అప్పటి వరకు కెరీర్‌పైనే ఫుల్ ఫోకస్ అంటున్నాడు ఈయన. ప్రస్తుతం సాయి కెరీర్ దూసుకుపోతుంది. 2018 వరకు కూడా సాయి ధరమ్ తేజ్ కెరీర్ డైలమాలో ఉండేది.
సాయి ధరమ్ తేజ్ పెళ్లి (sai dharam tej)
సాయి ధరమ్ తేజ్ పెళ్లి (sai dharam tej)

వరసగా అరడజన్ ఫ్లాపులు వచ్చాయి. అయితే 2019 ఈయన కెరీర్‌ను మార్చేసింది. చిత్రలహరితో పర్లేదనిపించిన ఈయన.. మారుతి తెరకెక్కించిన ప్ర‌తిరోజు పండ‌గేతో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటరూతో పాటు మరో మూడు సినిమాలు కూడా చేస్తున్నాడు. మొత్తానికి పెళ్ళి కంటే కెరీర్ ముఖ్యం అంటున్నాడు మెగా మేనల్లుడు.
Published by:Praveen Kumar Vadla
First published: