టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ముందున్నాడు. ఇప్పటికే మెగా కుటుంబంలో ముందు వరసలో ఉన్న చరణ్, బన్నీ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు క్యూలో ముందున్నాడు సాయి. ఆయన తర్వాత వరుణ్ తేజ్ ఉన్నాడు. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యమే లేదని వరుణ్ తేల్చేసాడు. మరోవైపు సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. తనకు పెళ్లి వయసు వచ్చి వెళ్లిపోతుందని.. అప్పుడే 33 ఏళ్లు వచ్చేశాయని సరదాగా జోక్ చేసాడు. పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు ఒకటే గొడవ చేస్తున్నారని చెప్పాడు. పెళ్లి వద్దని ఇంటి నుంచి పారిపోవడం కూడా ఇక కష్టమేనని తేల్చేసాడు సాయి.
అన్నీ కుదిర్తే 2020లోనే పెళ్లి బాజాలు మోగేలా ఉన్నాయని కూడా చెప్పేసాడు మెగా మేనల్లుడు. ఇప్పటికే అమ్మా వాళ్లు కూడా అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారని కన్ఫర్మ్ చేసాడు సాయి. అదృష్టం కలిసొస్తే ఈ ఏడాది ప్రేమలో పడతానేమోనని సరదా వ్యాఖ్యలు కూడా చేశాడు ఈ హీరో. మరోవైపు లాక్డౌన్ గురించి మాట్లాడుతూ... స్కూల్ డేస్ తర్వాత ఇన్ని రోజులు ఇంటి దగ్గరే ఉండటం ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పుకొచ్చాడు సాయి.
లాక్డౌన్ బోర్ అనిపించినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్పదని వివరించాడు సాయి. ప్రస్తుతం ఈయన వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈయన నటించిన సోలో బ్రతుకే సో బెటరూ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కొత్త దర్శకుడు సుబ్బు దీన్ని తెరకెక్కించాడు. మరోవైపు దేవా కట్టాతో పాటు మరో రెండు సినిమాలకు కూడా ఈయన కమిట్మెంట్ ఇచ్చేసాడు. వరస సినిమాలతో పాటు పెళ్లి ముచ్చట్లు కూడా చెప్పాడు సాయి. ఏదేమైనా కూడా ఈ హీరో జోరు చూస్తుంటే త్వరలోనే పప్పన్నం పెట్టేలా కనిపిస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sai Dharam Tej, Telugu Cinema, Tollywood