హోమ్ /వార్తలు /సినిమా /

Sarkaru Vaari Paata: రైతుకు ఊరట.. సర్కారు వారి పాట తీర్పును రిపీట్ చేసిన సుప్రీంకోర్టు

Sarkaru Vaari Paata: రైతుకు ఊరట.. సర్కారు వారి పాట తీర్పును రిపీట్ చేసిన సుప్రీంకోర్టు

‘సర్కారు వారి పాట’ మూవీ రివ్యూ (Twitter/Photo)

‘సర్కారు వారి పాట’ మూవీ రివ్యూ (Twitter/Photo)

ముందు పెద్ద చేపలను పట్టుకున్న తరువాత వారి జోలికి వెళ్లండి .. ఇలాంటి పిటిషన్ల వలన రైతుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయంటూ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.

మహేష్ బాబు సినిమాలంటే.. ఓ సోషల్ మెసేజ్ గ్యారంటీ అనే మార్క్ ఉంది. శ్రీమంతుడు, మహర్షి,సరిలేరు నీకెవ్వరూ,భరత్ అనే నేను.. ఇలా ఏ సినిమా చేసిన సొసైటీకి టాలీవుడ్ ప్రిన్స్ ఓ మెసేజ్ ఇస్తున్నాడు. తాజాగా సర్కారు వారి పాట కూడా అలాంటి కాన్సెఫ్ట్ తోనే వచ్చింది. ఓ మిడిల్ క్లాస్ కుటుంబం అప్పు తీసుకుంటే.. దాన్ని ఎంత బాధ్యతగా తీర్చుతుంది... ఆ అప్పు తీర్చకుంటే పరువు కోసం ప్రాణాలు కూడా తీసుకుంటుందన్న నిజాన్ని పరుశురాం.. మహేష్ బాబును ద్వారా అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో మహేష్ తల్లిదండ్రులు బ్యాంకులో తీసుకున్న రుణాన్ని తీర్చుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు. మహేష్ తండ్రిగా నాగబాబు నటించారు. నాగబాబు ఈ సినిమాలో ఓ రైతుగా నటించారు. దీంతో వారి ఇంటిని బ్యాంకు వారు జప్తు చేస్తారు. అదే 'సర్కారువారి పాట' సినిమాకు సంబంధించి తీర్పు మాదిరిగానే తాజాగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బ్యాంక్ రుణాలను ఎగ్గొట్టిన రైతుకు అనుకూలంగా తీర్పునిచ్చి చర్చనీయంశంగా మారింది.

డైరెక్టర్ పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో మహేష్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'సర్కారువారి పాట'. సంపన్నులైన సామాన్యులైన లోన్ రికవరీ విషయంలో ఎలాంటి తేడాని చూపించకూడదని ఇద్దరినీ ఒకేలా ట్రీట్ చేయాలని కథతో ఈ సినిమా తెరకెక్కింది. మే 12న సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇక తాజాగా ఇదే అంశాన్ని ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు రియల్ గా చెప్పడం విశేషంగా మారింది. రైతుల నుంచి లోన్ లు రికవరీ చేయాలంటూ ఓ బ్యాంకు వేసిన పిటీషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. 'పెద్ద చేపలను పట్టుకున్న తరువాత వారి జోలికి వెళ్లండి .. ఇలాంటి పిటిషన్ల వలన రైతుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి' అంటూ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.

దీంతో ప్రస్తుతం ఈ తీర్పు సంచలనంగా మారింది. ఇక ఈ తీర్పును సర్కారువారి పాట మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్ వారు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మహేష్ బాబు సినిమా ఎఫెక్ట్ అంటూ.. ప్రిన్స్ ఫ్యాన్స్ అంటుంటే.. ఎవడి డప్పు వాడు కొట్టుకుంటున్నారంటూ.. యాంటీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అప్పుడే మార్పు మొదలయ్యిందా అంటూ.. సెటైర్లు వేస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జి రాత్రి సినిమా చూసి.. పొద్దున్నే తీర్పు ఇచ్చేశారా అంటూ.. ఎద్దేవా చేస్తున్నారు. మొత్తం మీద మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ఈ పోస్టు నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది.

First published:

Tags: Mahesh Babu, Sarkaru Vaari Paata, Supreme Court

ఉత్తమ కథలు