బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. మానసిక ఒత్తిడి కారణంగా సుశాంత్ ముంబైలోని బాంద్రాలో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో సుశాంత్ మరణం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎంతో భవిష్యత్ ఉన్న సుశాంత్ అర్ధాంతరంగా ఆత్మహత్యకు పాల్పడడం ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులను తీవ్రంగా కలిచివేసింది. అది అలా ఉంటే ఈ కేసు ప్రస్తుతం అనేక మలుపులు తిరుగుతోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. సుశాంత్ కుటుంబం అభ్యర్థన మేరకు ఈ కేసును సిబిఐకి అప్పగించారు. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సిబిఐ విచారణ అంశంపై ఈ రోజు సుప్రీం కోర్టు తన నిర్ణయాన్ని తెలిపింది. అందులో భాగంగా ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు పేర్కొంది కోర్టు. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను అప్పగించాలని ముంబై పోలీసులకు ఆదేశించింది.
CBI jay ho
— Subramanian Swamy (@Swamy39) August 19, 2020
#Alert - Sushant Singh Rajput's sister Shweta Singh Kirti has welcomed the move. Soon after the Supreme Court's verdict, she took to Twitter writing, "Finally CBI for SSR."#CBIForSushant
Live updates: https://t.co/nzTM9BpyvC pic.twitter.com/GQ7EFTItNp
— CNNNews18 (@CNNnews18) August 19, 2020
#Alert - Akshay Kumar has also reacted to Supreme Court's verdict in Sushant Singh Rajput's case. The actor tweeted, "May truth always prevail."#CBIForSushant
Live updates: https://t.co/nzTM9BpyvC pic.twitter.com/vRqEWxj3T3
— CNNNews18 (@CNNnews18) August 19, 2020
ఇక ఈ కేసును సిబిఐకి అప్పగించాలని మొదటి నుండి డిమాండ్ చేస్తోన్న బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టు నిర్ణయంపై స్పందిస్తూ... 'సిబిఐ జయహో' అంటూ ట్వీటారు. ఇక మరో వైపు సుశాంత్ సోదరి స్వేతా సింగ్ కూడా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ సైతం సుప్రీకోర్టు తీర్పును స్వాగతిస్తూ.. నిజం ఎప్పటికి జయిస్తుందని ట్వీట్ చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sushanth singh Rajputh