SUPREME COURT CLEARS OTT RELEASE OF AMITABH BACHCHAN STARRER FILM JHUND SB
ఓటీటీలోకి అమితాబ్ సినిమా... తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే !
అమితాబ్ ఝుండ్ సినిమాకు షాక్
అమితాబచ్చన్ నటించిన జుండ్ సినిమాను ఈనెల ఆరవ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ రిలీజ్‌ను నిలిపివేయాలని హైదరాబాద్‌కు చెందిన ఫిల్మ్ మేకర్ నంది చిన్ని కుమార్ కోర్టులో పిటిషన్ వేశారు.
అమితాబచ్చన్ నటించిన జుండ్ సినిమాను ఈ నెల ఆరవ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ రిలీజ్‌ను నిలిపివేయాలని హైదరాబాద్‌కు చెందిన ఫిల్మ్ మేకర్ నంది చిన్ని కుమార్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హై కోర్టు ఇచ్చిన స్టేపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
అమితాబ్ బచ్చన్ తాజా చిత్రం జుండ్ మే 6న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 4న ఈ సినిమా థియేటర్లో విడుదలైంది. అయితే ఈ మూవీ ఓటీటీ విడుదలను ఆపాలంటూ తెలుగు నిర్మాత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అతడి పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఈ మూవీ డిజిటల్ రిలీజ్‌పై స్టే విధించింది.
హైదరాబాద్‌కు చెందిన నిర్మాత నంది కుమార్ ఏప్రిల్ 29న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పటిషన్ దాఖలు చేశాడు. జుండ్ మూవీ నిర్మాతలు కాపీ రైట్ నిబంధనలను ఉల్లఘించారని నంది కుమార్ తన పిటిషన్లో ఆరోపించాడు. నాగ్‌పూర్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ విజయ్ బార్సే జీవితం ఆధారంగా డైరెక్టర్ నాగరాజ్ మంజులే ఈ సినిమాను తెరకెక్కించాడు. అంకుశ్, ఆకాష్, రింకు సహా తదితరులు ఈ చిత్రంలో నటించారు.
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు కృష్ణ మురారి, హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసం ఇవాళ విచారణకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఈ స్టేపై పూర్తి వివరణ ఇవ్వలేదని, కేవలం ఒక లైన్ స్టెట్మెంట్ మాత్రమే ఇచ్చిందని సీనియర్ లాయర్ సీఏ సుందరం అన్నారు. దీంతో సుప్రీం కోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
స్లమ్ సాకర్ ఫౌండేషన్, ఫుట్‌బాల్ కోచ్ విజయ్ బర్సే జీవిత కథ ఆధారంగా జుండ్ చిత్రాన్ని తీశారు. ఓటీటీలో జుండ్ చిత్రాన్ని రిలీజ్ చేయవద్దు అని శుక్రవారం తెలంగాణ కోర్టు తన తీర్పులో పేర్కొన్న విషయం తెలిసిందే. చిత్ర నిర్మాతలు, నంది చిన్ని మధ్య జరిగిన సెటిల్మెంట్లో వివాదం తలెత్తిన కారణంగా జుండ్ సినిమా రిలీజ్‌పై సందిగ్ధం ఏర్పడింది.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.