హోమ్ /వార్తలు /సినిమా /

Tollywood: తెలుగు సినిమాలపై..సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

Tollywood: తెలుగు సినిమాలపై..సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

జస్టిస్ ఎన్వీ రమణ (ఫైల్)

జస్టిస్ ఎన్వీ రమణ (ఫైల్)

అలాంటి దయనీయ పరిస్థితిలోకి తెలుగు సినిమాని తీసుకురావద్దని తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయన సూచించారు. దీనితో ఈ కామెంట్స్ ఇపుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.

పాన్ ఇండియా మూవీ... ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపడుతున్న పదం. పలు సినిమాలు మంచి పేరు తెచ్చుకోవడంతో... ఇప్పుడు అంతా పాన్ ఇండియా హవా నడుస్తోంది. భారతీయ సినిమా గురించి మాట్లాడితే.. మన తెలుగు సినిమా ఇప్పుడు పై చేయి సాధించింది అని చెప్పుకోవడంలో ఎలాంటి తప్పులేదు. కొన్ని సినిమాలు తెలుగు సినిమా స్థాయి పెంచుతున్నాయి. అదే సమయంలో కొన్ని సినిమాలు మాత్రం ఆ రకంగా లేవు. అసలు డైలాగ్స్ కూడా అర్థం కాని తెలుగు సినిమాలు, పాటలు కూడా అర్థంకాని సినిమాలు కూడా ఉన్నాయి.

ఓ వైపు తెలుగుసినిమా గొప్పతనం గురించి పలువురు హీరోలు.. డైరెక్టర్లు గొప్పగా చెబుతున్న వేళ ... సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ తెలుగు సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి అయినటువంటి ఎన్ వి రమణ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తెలుగు సినిమాలు కేవలం కొంత కాలం మాత్రమే వినోదం ఇచ్చేలా ఉన్నాయన్నారు.  గత చిత్రాల్లా గుర్తుండిపోయే స్థాయి సినిమాలు రావడం లేదని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు బి ఏ రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఇపుడు పరిస్థితి ఎలా ఉంది అంటే మన తెలుగు సినిమాలను తెలుగు సబ్ టైటిల్స్ డైలాగ్స్ అర్ధం చేసుకొని పరిస్థితికి మారిందన్నారు చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ. అలాంటి దయనీయ పరిస్థితిలోకి తెలుగు సినిమాని తీసుకురావద్దని తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయన సూచించారు. దీనితో ఈ కామెంట్స్ ఇపుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు దీనిపై జోరుగానే చర్చించుకుంటున్నారు. ఆయన అన్న మాటల్లో తప్పకుండా నిజం ఉందని అంటున్నారు.

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే.. తెలుగింట కుటుంబం అంతా చూసేలా ఉండేది. రానురాను మారుతున్న కాలంతో సినిమా కూడా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తెలుగు సినిమాలో అచ్చమైన తెలుగులోనే డైలాగ్స్ ఉండేవి. పాత సామెతల్ని పెద్దల చెప్పే మాటలను, పద్యాలు, కవితలు ఇలా అన్ని కలగలిపి తెలుగు సినిమాను తెరకెక్కించేవారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమాలో తెలుగు కన్నా ఇంగ్లీష్ పదాలు, పాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. చీఫ్ జస్టీస్ ఎన్వీరమణ చేసిన వ్యాఖ్యలతో అయినా.. తెలుగు సినిమాకు పాత రోజుల్ని తీసుకువస్తారా రారా ? అనేది వేచి చూడాలి.

First published:

Tags: NV Ramana, Supreme Court, Tollywood, Tollywood Movie News

ఉత్తమ కథలు