Superstar Rajinikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్‌కి ఇవాళ షాకింగ్ న్యూస్ తెలిసింది. రజనీకాంత్ సినిమా అణ్ణాత్తే సెట్స్‌లో పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వార్తలు వచ్చాయి. హైదరాబాద్‌లోని ఫిలింసిటీలో ఈ మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభం కాగా.. సెట్స్‌లో కరోనా కలకలం రేపడంతో.. టీమ్ మొత్తం చెన్నైకి తిరిగి వెళ్లారు. ఈ క్రమంలో రజనీకాంత్‌కి కూడా టెస్ట్‌లు నిర్వహించారు. ఆ టెస్ట్‌లో రజనీకాంత్‌కి నెగిటివ్‌గా తేలింది. దీంతో రజనీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు అణ్ణాత్తే టీమ్‌లో కరోనా సోకడంపై నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. అణ్ణాత్తే షూటింగ్లో రొటీన్‌గా కరోనా పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రజనీకాంత్‌తో పాటు మిగిలిన నటీనటులకు నెగిటివ్‌గా తేలింది. దీంతో అణ్ణాత్తే షూటింగ్‌ని వాయిదా వేశాము అని సన్ పిక్చర్స్ ఓ ప్రకటనను ఇచ్చింది.
కాగా వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటోన్న రజనీకాంత్.. త్వరలోనే పార్టీ పేరును ప్రకటిస్తానని ఈ మధ్యన తెలిపారు. ఈ క్రమంలో ఆ లోపు తన అణ్ణాత్తే షూటింగ్‌ని పూర్తి చేయాలనుకున్నాడు.అంతేకాదు రోజుకు 14 గంటల చొప్పున రజనీకాంత్ షూటింగ్లో పాల్గొన్నట్లు కూడా సమాచారం. కానీ ఈ లోపు యూనిట్ సభ్యులకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అటు టీమ్‌తో పాటు ఇటు ఫ్యాన్స్ షాక్‌కి గురయ్యారు.
అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న అణ్ణాత్తేలో రజనీకాంత్ సరసన మీనా, ఖుష్బూ, నయనతార నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, కీర్తి సురేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి శివ దర్శకత్వం వహిస్తుండగా.. డి.ఇమ్మన్ సంగీతం అందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, Kollywood News, Rajinikanth