Rajinikanth: రజినీకాంత్ సంచలన నిర్ణయం.. టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్..

Rajinikanth: రజినీకాంత్ ఏం చేసినా కూడా అభిమానులకు నచ్చుతుంది. ఆయన వెంటనే ఉంటారు వాళ్లు. కానీ కొన్నిసార్లు మాత్రం రజినీ చేసే పనులు వాళ్లకు నచ్చవు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. రజినీకాంత్ తీసుకున్న..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 1, 2020, 3:06 PM IST
Rajinikanth: రజినీకాంత్ సంచలన నిర్ణయం.. టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్..
రజినీకాంత్ (Rajinikanth)
  • Share this:
రజినీకాంత్ ఏం చేసినా కూడా అభిమానులకు నచ్చుతుంది. ఆయన వెంటనే ఉంటారు వాళ్లు. కానీ కొన్నిసార్లు మాత్రం రజినీ చేసే పనులు వాళ్లకు నచ్చవు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. రజినీకాంత్ తీసుకున్న ఓ నిర్ణయంతో అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. మీరు ఇంట్లోనే కూర్చోండి అంటూ అభిమానంతో కూడిన డిమాండ్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ ఏం స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకు కనీసం 80 వేల కేసులు.. ఇంకాస్త తీవ్రత ఉంటే లక్ష కూడా వస్తున్నాయి. ఇప్పటికే దేశంలో కూడా 65 లక్షల కేసులు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో రజినీకాంత్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొన్ని నెలలుగా రజినీ పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయాడు. ఆర్నెళ్లుగా ఆయన ఎవర్నీ కలవడం లేదు. పైగా మొన్న ఎస్పీ బాలు చనిపోయినపుడు కూడా బయటికి రాలేకపోయాడు. ఇంట్లోనే ఉండి తన వీడియో బైట్ పంపించాడు సూపర్ స్టార్.

రజినీకాంత్ (Rajinikanth)
రజినీకాంత్ (Rajinikanth)


ఇదిలా ఉంటే కొందరు ఇప్పటికే షూటింగ్స్ మొదలు పెట్టారు. అయితే స్టార్ హీరోలు మాత్రం ఎవరూ బయటికి రావడం లేదు. నాగార్జున, సాయి ధరమ్ తేజ్ లాంటి వాళ్లు మాత్రం ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ కూడా షూటింగ్స్‌కు రావడానికి నిర్ణయం తీసుకున్నాడు. మొదట నో చెప్పినా కూడా ఇప్పుడు మాత్రం ఆయన అన్నాత్తే సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు. సాధారణంగా 60 ఏళ్ల పైబడిన వ్యక్తులు బయటికి వెళ్లడం అంత మంచిది కాదని ప్రభుత్వం పదేపదే చెబుతుంది.

రజినీకాంత్ (Rajinikanth)
రజినీకాంత్ (Rajinikanth)


రజినీకాంత్ వయసు 70 ఏళ్లు. ఇలాంటి సమయంలో ఈయన షూటింగ్‌కు రానుండటం అనేది చిన్న విషయం కాదు. అయితే ముందు నుంచి నో అనే చెప్పినా కూడా తన ఒక్కడి వల్ల సినిమా షూటింగ్ మొత్తం ఆగిపోతుండటంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు సూపర్ స్టార్. అక్టోబర్ 15 నుంచి హైదరాబాద్‌లో జరగబోయే షెడ్యూల్‌కు సూపర్ స్టార్ వస్తున్నాడు. ఈయన కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే అక్టోబర్ 8 నాటికి హైదరాబాద్ చేరుకుంటాడు రజినీకాంత్. షూటింగ్ మొదలయ్యే నాటికి టీమ్ మొత్తానికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి.. అందరికీ నెగిటివ్ వచ్చిన తర్వాతే షూట్ ప్రారంభించాలని చూస్తున్నారు.

రజినీకాంత్, బాలసుబ్రమణ్యం
రజినీకాంత్, బాలసుబ్రమణ్యం


ఇక్కడ మరో విషయం ఏంటంటే రజినీకాంత్ ఫ్లైట్‌లో కాకుండా కారులోనే రానున్నాడని తెలుస్తుంది. రిస్క్ తీసుకోడానికి ఏ మాత్రం యిష్టపడటం లేదు సూపర్ స్టార్. రజినీ ధైర్యం చేసి చిత్రీకరణకు ఓకే చెప్పడంతో దర్శకుడు శివ గాల్లో తేలిపోతున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసాడు శివ. మిగిలిన భాగం కూడా పూర్తి చేసి సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేయాలని చూస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో మీనా, నయనతార, కీర్తి సురేష్, ఖుష్బూ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. పక్కా విలేజ్ మాస్ డ్రామాగా ఈ సినిమా వస్తుంది. ఇందులో రజినీకాంత్ ఇంట్రో సాంగ్ లెజెండరీ గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడటం విశేషం. ఈయన పాడిన చివరి పాట కూడా ఇదే.
Published by: Praveen Kumar Vadla
First published: October 1, 2020, 3:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading